Taraka Ratna: కొత్త సినిమాపై ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. మళ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా!

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా ఎన్నో విభాగాల్లో రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. గతంలో కొన్ని ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డా.. 'టెంపర్' నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం)తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగి తన స్థాయిని, మార్కెట్‌ను విశ్వవ్యాప్తంగా పెంచుకున్నాడు.

తన 30వ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు. కానీ, ఈ మూవీ మాత్రం అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వేట మొదలెట్టడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేసింది. ఇక, న్యూ ఇయర్ రోజు ఏకంగా ఈ మూవీని రిలీజ్ చేయబోయే డేట్‌నే ప్రకటించారు.

NTR and Koratala Movie First Schedule Depends on Taraka Ratna Health

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో సెట్‌లను కూడా నిర్మిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం రెగ్యూలర్ షూట్‌పై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ మూవీని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని అనుకున్నారట. కానీ, ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం విషమించడంతో ఎన్టీఆర్ దీన్ని వాయిదా వేయాలని కొరటాలకు చెప్పినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

NTR and Koratala Movie First Schedule Depends on Taraka Ratna Health

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోయే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసే ఛాన్స్ ఉంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X