రంగంలోకి తారక్, రాజమౌళి.. ‘తెల్లవారితే గురువారం’ ప్లాన్ అదుర్స్
తెల్లవారితే గురువారం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణికాంత్ జెల్లీ వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు. ఇప్పటికే వదిలిన టీజర్, సాంగ్స్, పోస్టర్లు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తమ సినిమాను భారీ రేంజ్‌లో ప్రమోట్ చేసుకునేందుకు దిగ్గజాలను రంగంలోకి దించేసింది. తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి రాబోతోన్నారట. ఈ మేరకు సమాచారం బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ అప్డేట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

మార్చి 27న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని, దానికి రాజమౌళి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రాబోతోన్నారని తెలుస్తోంది. వారాహి చలన చిత్రం సంస్థ అంటే రాజమౌళికి సొంత ప్రొడక్షన్ లాంటిదే. అందుకే వారు ఆహ్వానించగానే రాజమౌళి ఓకే చెప్పినట్టున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్‌కు రాబోతోన్నారని టాక్.


Click it and Unblock the Notifications











