ఇద్దరూ కలిసి తాపీగా.. అభిమానితో ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఫోటోలు వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఇరువురు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరితో రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకముందు రిలీజైన ఓ పోస్టర్ ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. సోఫాలో కూర్చొన్న ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు కాళ్లేసుకుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఇద్దరితో భారీ ఎత్తున..
ఆ ఫోటో బయటకు రావడంతోనే ఆర్ఆర్ఆర్ లాంటి ఓ భారీ మల్టీ స్టారర్ రాబోతోందని అందరికీ అర్థమైంది. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన సంఘటనలకు ఊహాత్మకమైన కల్పిత కథే ఆర్ఆర్ఆర్ అంటూ నేపథ్యాన్ని వివరించాడు దర్శకధీరుడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

లీకైన ఫోటోలు..
ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను రాజమౌళి ఎంత పకడ్బందీగా చేసినా.. ఫోటోలు, స్టిల్స్ లీకవుతూనే ఉన్నాయి. తాజాగా కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ఎన్టీఆర్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అప్రత్తమైన జక్కన్న అందరిపైనా సీరియస్ అయ్యాడని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం విశాఖ అడవుల్లో..
ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ప్రస్తుతం విశాఖపట్నం, అరుకులోయకు దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఒక్క రోజు బ్రేక్ ఇస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. మత్తువదలరా మూవీ విడుదల సందర్భంగా డిసెంబర్ 25న షూటింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.

తాపీగా ఈ ఇద్దరూ..
ఈ ఇద్దరూ ఒకే ఫ్రేములో కనిపించి చాలా రోజులు అవుతండగా.. తాజాగా ఓ పిక్‌తో అభిమానులను పలకరించారు. ఓ అభిమానితో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోతో పాటు.. వంటగదిలో తాపీగా పనులు చేసుకుంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్, ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











