ఎన్టీఆర్ బయోపిక్.. మహానేతను ప్రజల్లోకి నడిపించిన వ్యక్తితో..
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న తెలిసిందే. ఈ చిత్రంలోని కీలక పాత్రల పరిచయం కొద్దిరోజులుగా నిరంతరంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన ఫొటోను రిలీజ్ చేసింది.
ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ వెనుక డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆవేశంగా ఎన్టీఆర్ చేతినెత్తగా.. ఆయనకు రక్షణగా, వెన్నుదన్నుగా దగ్గుబాటి నిలుచున్నారు. ఎన్టీఆర్ అల్లుడిగా, మాజీ మంత్రి పురందేశ్వరికి భర్తగా దగ్గుబాటి తెలుగువారికి సుపరిచితులు. కాగా దగ్గుబాటి పాత్రను ఈ చిత్రంలో డాక్టర్ భరత్ రెడ్డి పోషిస్తున్నారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్ వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి దగ్గుబాటి. ఆయన పాత్రలో నటిస్తున్న భరత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతున్నది. తొలిపార్ట్‌కు కథానాయకుడిగా, రెండో భాగానికి మహానాయకుడిగా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం జనవరి 9న తొలిభాగం, జనవరి 24వ తేదీన రెండో భాగం విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











