‘ఎన్టీఆర్ బయోపిక్’ డిజిటల్ రైట్స్ భారీ రేటుకు దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్
సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు సినిమా ప్రేక్షకుల్లో 'ఎన్టీఆర్ బయోపిక్' చూడాలనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకునేందకు ఈ తరం యువత సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ డిజిటల్ రైట్స్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అమేజాన్ ప్రైమ్ సంస్థ రూ. 25 కోట్లకు ఎన్టీఆర్ బయోపిక్' తెలుగు, తమిళం, హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఇది భారీ మొత్తమే అంంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మరో వైపు శాటిలైట్ రైట్స్‌కు సైతం మంచి రేటుకు అమ్మడు పోతాయనే టాక్ వినిపిస్తోంది. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ ఎన్‌బికె ఫిల్మ్స్ దాదాపు రూ. 45 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని అంటున్నారు.

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'.. 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.
తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా మాత్రమే కాదు... ఇండస్ట్రీకి చెందిన ఎక్కువ మంది పాత్రలు ఈ చిత్రంలో కనిపించబోతుండటం ఇదే తొలిసారి. వారాహి చలన చిత్రం సమర్పణలో బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











