ఇటు బాలయ్య, అటు రామ్ చరణ్... పోస్టర్ లుక్ అదిరిపోయింది!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్-కథానాయకుడు'... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ 'వినయ విధేయ రామ' సంక్రాంతి విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే ఆడియో వేడుక, ట్రైలర్ రిలీజ్ లాంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ జోరు పెంచాయి.
ఈ రెండు సినిమాల విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాలపై అంచనాలు మరింత పెంచేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో బాలకృష్ణ
'ఎన్టీఆర్ బయోపిక్'లో తన తండ్రి పాత్రను పోషిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాలోని ఓ సీన్లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీ రామారావు సినీ కెరీర్లో వెలితిగా మిగిలిపోయిన పాత్ర అల్లూరి సీతారామరాజు. అయితే 'మేజర్ చంద్రకాంత్' మూవీలో వచ్చే ఓ పాటలో మన్యంవీరుడిగా కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ చిత్ర బృందం విడుదల చేసింది.

ఎన్టీఆర్ బయోపిక్
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'.. 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

హాలీవుడ్ హీరో స్టైల్‌లో
హాలీవుడ్ హీరో స్టైల్‌లో రామ్ చరణ్ గన్ పేలుస్తున్న ఓ కొత్త పోస్టర్ ‘వినయ విధేయ రామ' చిత్ర బృందం విడుదల చేసింది. ఒంటిపై టాటూలతో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు.

వినయ విధేయ రామ
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `వినయ విధేయ రామ`. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











