ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రను పోషించే ప్రముఖ దర్శకుడు ఎవరంటే?

ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్టీ రామారావు సినీ, రాజకీయ జీవితంతో సంబంధం ఉన్న ఎందరో ప్రముఖులను ఇందులో ఫోకస్ చేయబోతున్న నేపథ్యంలో ఆ పాత్రలకు తగిన వ్యక్తులను ఎంపికే చేయడంలో దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ చిత్రంలో ఎన్టీ రామారావు పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్, అక్కినేని పాత్రను సుమంత్ ఇలా సినిమాలోని ముఖ్య పాత్రలను పోషించే నటుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

NTR biopic: VV Vinayak is going to play Dasari Narayana Rao role

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో దర్శకరత్న దాసరి నారాయణ రావు పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇతర పాత్రల విషయానికొస్తే ఎన్టీ రామారావు భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబు పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామారావు సినీ జీతాన్ని 'కథానాయకుడు'... రాజకీయ జీవితాన్ని 'మహానాయకుడు' పేరుతో విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం వచ్చే జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X