ఎన్టీఆర్ కోసం ఏకమవుతున్న టాలీవుడ్ బిగ్ స్టార్స్.. పవన్, ప్రభాస్, బన్నీ.. ఆ స్టార్స్ కూడా..

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత నెల రోజుల నుంచి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20న హైదరాబాద్ లోని కేపీహెచ్బి లో గ్రాండ్ గా ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరపనున్నారు

దీనికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారు. వీరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులని కూడా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఈ శతజయంతి వేడుకలకి టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరిని ఇన్వైట్ చేశారు.

NTR Centenary Celebrations and tollywood stard are gracing the event

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరిని ఆహ్వానించారు. అయితే చిరంజీవి, నాగార్జున వెంకటేష్ తప్ప మిగిలిన హీరోలు అందరూ కూడా ఈ శతజయంతి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే వేదికపై వచ్చి ఎన్టీఆర్ కి నివాళి అర్పించబోతున్నారు.

టాలీవుడ్ గర్వించదగ్గ నట సార్వభౌముడి 100 ఏళ్ళ వేడుకలో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొనడం ద్వారా ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించినట్లు అవుతుంది. ఇప్పటికే ఏపీలో శతజయంతి ఉత్సవాలని నిర్వహించగా సూపర్ స్టార్ రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఆ ఈవెంట్ టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది.

మరి నందమూరి శతజయంతి ఉత్సవాల ద్వారా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గర చేసుకుంటారా, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మే20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం అదే రోజు శతజయంతి వేడుకలు సీనియర్ ఎన్టీఆర్ కి నిర్వహించడం యాదృచ్చికం అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X