twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్టర్ మజ్ను సక్సెస్ కోసం యంగ్ టైగర్.. నీ సహకారం మరువలేనిది.. అఖిల్ ట్వీట్

    |

    అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మజ్ను'. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. చిత్రంలోని అన్ని పాటలకు శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే..

    జనవరి 19న ప్రీ రిలీజ్ ఫంక్షన్

    జనవరి 19న ప్రీ రిలీజ్ ఫంక్షన్

    కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 19న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

     ఎన్టీఆర్ గురించి అఖిల్ ట్వీట్

    ఎన్టీఆర్ గురించి అఖిల్ ట్వీట్

    త్వరలో కలుసుకొందాం. థాంక్యూ టూ మై బ్రదర్ తారక్. నీవు అందిస్తున్న సహకారం మరువలేనిది. నీతో వేదిక పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాల గురించి ఆలోచిస్తే చాలా ఎక్సైటింగ్ ఉంది అని అఖిల్ ట్వీట్ చేశారు.

    వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో

    వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో

    తొలి ప్రేమ తర్వాత వెంకీ అట్లూరి రూపొందిస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకొన్నారు.

    నిధి అగర్వాల్ హీరోయిన్‌గా

    నిధి అగర్వాల్ హీరోయిన్‌గా

    అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
    ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

    English summary
    Akhil Akkineni's Mister Majnu movie pre release function organising in Hyderabad on January 19th. For This function, NTR is attending as chief guest. This movie set to release on January 25th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X