పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఎన్టీఆర్ క్లాప్.. రామ్ చరణ్ కామెడీకి కపిల్ శర్మ ఫిదా
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ఆఫ్ స్క్రీన్ మంచి స్నేహితులు అని చాలామందికి తెలియదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కూడా వారి స్నేహం గురించి చాలా విషయాలను చెబుతున్నారు. ఎప్పుడు కూడా బహిర్గతం చేసుకోకుండా ప్రైవేటుగానే స్నేహంగా ఉండడానికి ఇష్ట పడతాము అని చెబుతున్నారు.

మెగా ఫ్యాన్స్ పై తారక్ కామెంట్
అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ తో తమ స్నేహం ఇంకా బలంగా మారింది అని నా అభిమానులు రామ్ చరణ్ నటన ఇష్టపడతారని తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్ మెగా అభిమానులు కూడా తనను ఎంతగానో ఇష్టపడతారని పాజిటివ్ గా తెలియజేశాడు. తప్పకుండా ఈ సినిమాతో అభిమానులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారని కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు.

కపిల్ శర్మ షోలో..
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి ముగ్గురు కూడా బాలీవుడ్ మీడియాలో నిన్నటివరక కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా టెలివిజన్ రియాలిటీ షోలలో కూడా బాగానే ప్రమోట్ చేశారు. ఇటీవల సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ తో పాటు ఇండియన్ బెస్ట్ కామెడీ షో కపిల్ శర్మ షోలో కూడా RRR టీమ్ సందడి చేసింది. వీరితోపాటు అలియా భట్ కూడా ఆ షోలో పాల్గొని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

సేన్స్ ఆఫ్ హ్యూమర్
అయితే ఆ కామెడీ షోలో ఇటీవల పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఎన్టీఆర్ క్లాప్ కొట్టిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అదే వీడియోలో రామ్ చరణ్ తేజ్ కు సంబంధించిన సేన్స్ ఆఫ్ హ్యూమర్ విషయం కూడా బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కపిల్ శర్మ ప్రశ్న..
కపిల్ శర్మ సాధారణ జనాల్లో కలిగే నార్మల్ సందేహాలను షో లలో అడుగుతూ స్టార్స్ కు కూడా చాలా నవ్వు తెప్పిస్తాడు. ఇక రామ్ చరణ్ తో మాట్లాడుతూ.. మీ నాన్నగారు చిరంజీవి పెద్ద స్టార్ అలాగే మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా మరొక స్టార్ హీరో.. ఎప్పుడైనా మీరు ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాచ్ మెన్ వచ్చి మిమ్మల్ని కలవడానికి అభిమాని వచ్చాడు అని చెబితే ఎవరి ఫ్యాన్ అని కన్ఫ్యూజన్ కలుగుతుందా అని రామ్ చరణ్ ను సరదాగా అడిగాడు.

దర్శకులు వస్తేనే..
కపిల్ శర్మ అలా ఒక విచిత్రమైన ప్రశ్న అడగ్గానే రామ్ చరణ్ కూడా సెన్సాఫ్ హ్యూమర్ కి తగ్గట్లుగానే సమాధానమిచ్చాడు. సాధారణంగా అభిమానులు వస్తే అంత పెద్దగా టెన్షన్ ఉండదు.. కాకపోతే దర్శకులు వచ్చారని చెబితే మాత్రం ఎవరికి కథ చెప్పడానికి వచ్చారని? కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటాము అనే తరహాలో రామ్ చరణ్ నవ్వుకుంటూ వివరణ ఇచ్చాడు.
Recommended Video

క్లాప్ కొట్టిన ఎన్టీఆర్
అయితే కపిల్ శర్మ.. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ పేర్లు చెబుతూ వాళ్ళు పెద్ద స్టార్స్ అంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లాప్ కొట్టడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా త్రివిక్రమ్ అరవింద సమేత లాంచ్ లో కలుసుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీతో నందమూరి ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉందని చాలా సందర్భాల్లో రుజువైంది.


Click it and Unblock the Notifications











