Devara: భీమ్లా నాయక్‌ను కొట్టలేకపోయిన దేవర.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ రికార్డుకు దూరంగా ఎన్టీఆర్!
Devara vs Bheemla Nayak: ఫ్యాన్స్ కు తమ ఇష్టమైన హీరో మూవీ గానీ, ఏదైనా అప్డేట్ వస్తే పండుగే. తమ హీరోల సినిమాల కోసం, వారి మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. మరి వాళ్ళు అంతగా వెయిట్ చేస్తున్నపుడు ఒక చిన్న అప్డేట్ ఇచ్చినా ఫ్యాన్స్ కు పూనకాలే. ఆ అప్డేట్ దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. కామెంట్స్, రివ్యూస్ పెడుతూ రచ్చ రచ్చ చేయాల్సిందే. ఈ మధ్యకాలంలో అభిమానులు తన అభిమాని నటుడుకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్త గమనిస్తున్నారు. కేవలం బాక్సాఫీస్ రికార్డ్స్ నే కాదు. ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్ ని కూడా ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతి వ్యూస్, ప్రతి లైక్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఫ్యాన్స్.
'మా హీరో మూవీ ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ వచ్చాయి. ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ వచ్చాయి. 24 గంటల్లో ఆ సినిమా రికార్డు బ్రేక్ 'అంటూ సినీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మూవీపై హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ లెక్కలోకి తీసుకుంటున్నారు. ఆ విధంగా మూవీ ట్రైలర్ రికార్డ్స్ తెర మీదికి వస్తున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' వర్సెస్ పవన్ కళ్యాన్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ రికార్డు విషయం చర్చనీయంగా మారింది.

అత్యంత వేగవంతమైన 100k లైక్ చేసిన ట్రైలర్‌లు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ 'దేవర', పవన్ కళ్యాన్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ లు పోటీ పడుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్, లిరికల్ వీడియో సాంగ్స్, కలెక్షన్స్ ఇలా ప్రతీ విషయంలో ఈ మూవీ ఆల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్ ట్రైలర్స్ కేవలం 3 నిమిషాల్లో 100k లైక్ ని అందుకుని అల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. అలాగే..టాలీవుడ్ లో ఇప్పటి వరకు వేగంగా మిలియన్ లైక్స్ రప్పించుకున్న ట్రైలర్స్ గా నిలిచింది.
ఈ రికార్డును ఏ హీరో మూవీ అయినా బ్రేక్ చేస్తుందా? అని చూస్తున్నారు. కానీ, ఆ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యం కావడం లేదు. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ 'దేవర'మూవీ ట్రైలర్ ఈ రికార్డు బ్రేక్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఇగర్ గా వెయిట్ చేశారు. కానీ అసాధ్యం కాలేదు. తాజాగా విడుదలైన దేవర మూవీ ట్రైలర్ 9 నిమిషాలలో 100k లైక్ ని అందుకుని తర్వతి స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాన్ రికార్డు బ్రేక్ అవుతుందని వెయిట్ చేసిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇదిలాఉంటే. పవన్ కళ్యాన్ 'భీమ్లా నాయక్' రికార్డు సేఫ్ గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మీకు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావాలేమో పవన్ కళ్యాణ్ కు కేవలం మలయాళ ఓటీటీ రీమేక్ చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తర్వలో విడుదల కాబోతున్న పవన్ ఓజీ మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తామని మెగా ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు.


Click it and Unblock the Notifications











