రాజమౌళి అడ్డుపడ్డారు.. సారీ బ్రదర్.. గిఫ్ట్ లేకపోతున్నా.. రాంచరణ్‌కు ఎన్టీఆర్ ట్వీట్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదినాన్ని అభిమానులే కాదు.. స్నేహితులు కూడా ప్రేమతో కూడా స్వాగతిస్తారు. టాలీవుడ్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా పేరున్న సంగతి తెలిసిందే. మార్చి 27న చెర్రీ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. నీ బర్త్ డే సందర్బంగా నేను ఓ వీడియోను నీకు బహుమతిగా అందిస్తాను అని ట్వీట్ చేశారు.

బ్రో రాంచరణ్.. మంచి సమయంలో నీ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని భావించాను. కానీ లాక్‌డౌన్ ఖారణంగా, ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అందుచేత నీకు శుక్రవారం ఉదయం 10 గంటకు మంచి డిజిటల్ సర్‌ప్రైజ్ అందిస్తాను. అదీ నీకు ఎప్పడూ గుర్తుండిపోతుంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు రాంచరణ్ స్పందిస్తూ.. సరైన సమయంలోనే నేను ట్విట్టర్‌లోకి ప్రవేశించాను. లేకపోతే మంచి గిఫ్ట్ మిస్ అయ్యేవాడిని అంటూ సమాధానం ఇచ్చారు.

 NTR digital gift to Ram Charan: Rajamouli not happy with..

అయితే శుక్రవారం ఉదయమే.. ఎన్టీఆర్ మరో ట్వీట్ చేసి.. నేను రాత్రే నీ గిఫ్టును సిద్ధం చేశాను. పంపించే ముందు ఓ సారి ఆయన అభిప్రాయాన్ని తీసుకొందామని జక్కన్నకు చూపించాను. అయితే సంగతి తెలుసుగా.. ఓ రేంజ్ ఉంటేగానీ సంతృప్తి చెందరు.. అందురకే నీ గిఫ్టు ఆలస్యమైంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

దీంతో ఎన్టీఆర్ ఎలాంటి డిజిటల్ గిఫ్టు అందిస్తారనే ఆతృతతో ఎదురు చూసిన అభిమానులకు కొంత నిరాశే ఎదురైంది. అయితే ఎన్టీఆర్ గిఫ్టుపై మాత్రం ఆసక్తి మరింత ఎక్కువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X