ఎన్టీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. అలా ఆ సినిమా చేశా.. సురేందర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ఎలాంటి కథనైనా తనదైన స్టైల్‌లో.. అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించే దర్శకుడు సురేందర్ రెడ్డి. తీసిన మొదటి చిత్రమే ఘన విజయాన్ని సాధించటంతో టాలీవుడ్ అతని పేరు మార్మోగిపోయింది. కళ్యాణ్ రామ్‌తో అతనొక్కడే అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సురేందర్ రెడ్డి.. ఒక్కసారి వార్తల్లో నిలిచాడు. ఆ మూవీ తెరకెక్కించిన విధానానికి అందరూ మంత్ర ముగ్దులై.. ప్రశంసలు కురిపించారు. అలాంటి ఘన విజయాన్ని సాధించిన తరువాత దర్శకుడికి అవకాశాలు వెల్లువెత్తాయి.

రెండో సినిమాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో..
అతనొక్కడే లాంటి హిట్ సినిమాను తీసిన దర్శకుడితో పని చేయాలని ఎంతో మంది నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఎంతో మంది హీరోలు సైతం సురేందర్ రెడ్డితో పని చేయాలని భావించారని టాక్. అయితే అతను మాత్రం ఎన్టీఆర్‌తో అశోక్ సినిమాను చేశాడు. అయితే ఈ విషయం గురించి సురేందర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎమోషనల్ బ్లాక్ మెయిల్..
అతనొక్కడే సక్సెస్ అయ్యాక తాను ఓ నిర్మాతకు కమిట్ అయ్యానని తెలిపాడు. అది ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా అని పేర్కొన్నాడు. అయితే ఎన్టీఆర్ మేనేజర్ వచ్చి ఓ రెండు రోజులు తీసుకెళ్లి పోయాడని, కూర్చోబెట్టి ఏవేవో చెప్పి చాలా ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపాడు.

అప్పుడు తారక్‌ను కలిశాను..
అలా రెండు మూడు రోజులు నిరంతరంగా ఫాలో అయ్యారని, తారక్ అంటే పెద్ద హీరో.. వెళ్లకపోతే బాగుండదేమో.. ఇంత ఎమోషనల్‌గా చేస్తున్నారని అనుకుని అప్పుడు తారక్‌ను కలిశానని చెప్పుకొచ్చాడు. అలా అశోక్ సినిమా పట్టాలెక్కిందని నాటి సంగతులను బయట పెట్టాడు.
Recommended Video

సక్సెస్ కాని కాంబినేషన్..
అతనొక్కడే సక్సెస్ తరువాత సురేందర్ రెడ్డితో ఎన్టీఆర్ చేసిన అశోక్ అంతగా ఆడలేదు. యావరేజ్ టాక్‌తో పర్వాలేదనిపించింది. అటుపై మళ్లీ కిక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డితో ఊసరవెల్లి చేశాడు. అది కూడా బెడిసికొట్టింది. సురేందర్ రెడ్డి రీసెంట్‌గా సైరా లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని తీసి అందర్నీ మెప్పించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











