RRR : ఎన్టీఆర్ 10% కూడా లేడు.. నాలుగేళ్లు నాశనం చేశారు.. జక్కన్నని టార్గెట్ చేసి ఫ్యాన్స్ ఆవేదన!
బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను మడత పెట్టేసిన రాజమౌళి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా ఉందని ప్రకటించగానే తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే అంశం మీద ఫోకస్ పెట్టింది. అయితే ముందు నుంచి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల నిడివి విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. ఈ సినిమాలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం మీద నుంచి కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వాదులాడుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదల అయింది అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..

సమాన ప్రాధాన్యత
దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నాను అని ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ గోండు జాతి ముద్దుబిడ్డ కొమురం భీం పాత్రలో నటించారు. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కథ కావడంతో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు

తక్కువ చేసే ప్రయత్నం
అయితే సినిమా చూసిన వారిలో కొంతమంది సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ పాత్ర కంటే బాగుందని ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది వారిద్దరి పాత్రలు కరెక్ట్ గానే కుదిరాయి అని ఎవరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేసే ప్రయత్నం రాజమౌళి చేయ లేదని అంటున్నారు.

అన్నా అని పిలవడం
నిజానికి రామ్ చరణ్ అల్లూరి క్యారెక్టర్ సహా మిగతా షేడ్స్ ఎలివేట్ అయినంత బాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఎలివేట్ అవ్వలేదని కొందరిలో అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం ఎన్టీఆర్ అమాయకపు ట్రైబల్ గా లుక్స్ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉండటం, అలాగే చరణ్ ని అన్నా అన్నా అని పిలవడం కొద్దిగా ఎన్టీఆర్ ఫాన్స్ ఫీల్ అవుతున్నట్టు చెప్పచ్చు.

అర్ధం ఏముంటుంది?
అదే రామ్ చరణ్ పోలీస్ లుక్ లో, నీట్ షేవ్ చేసుకుని హైలెట్ అయ్యాడు. ఆ తర్వాత మఫ్టీలో ఎన్టీఆర్ ను కలిసి గడిపిన సమయంలో కూడా ఆయన లుక్ హైలైట్ అయింది. దానికి తగ్గట్టు అల్లూరి గెటప్ చరణ్ ని మరింతగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. కానీ ఎన్టీఆర్ కేవలం రెండే షేడ్స్ కు పరిమిత అవుతాడు. ఒక పెద్ద ఊరిలో చదువుకుని పోలీసు ఉద్యోగం సాధించిన వ్యక్తికి, ఒక గిరిజన వ్యక్తికీ తేడా చూపించకపోతే అర్ధం ఏముంటుంది అనుకుని రాజమౌళి భావించి ఉండవచ్చు.

భావోద్వేగానికి గురవుతున్నారు
కానీ అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇబ్బందిగా మారింది. నిజానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప ఎన్టీఆర్-రామ్ చరణ్ పాత్రల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు. ఎన్టీఆర్, చరణ్ లకి సరిసమానమైన కేరెక్టర్ రాజమౌళి ఇచ్చారు. అయితే సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే మైకులు ముఖాన పెడుతుంటే ఫాన్స్ కొంచెం భావోద్వేగానికి గురవుతున్నారు.
Recommended Video


ఇలా చేయడం తగదని
అందులో భాగంగానే సినిమా ఫ్లాప్ అని ఇది రామ్ చరణ్ సినిమా అని అంటూ కామెంట్ చేస్తున్నారు. చరణ్ 90% ఉంటే ఎన్టీఆర్ కు 10% మాత్రమే ప్రాధాన్యత ఉందని, నాలుగేళ్ల డేట్స్ తీసుకుని ఇలా చేయడం ఏమీ బాలేదని రాజమౌళిని విమర్శిస్తున్నారు. ఆ సైడ్ క్యారెక్టర్ కోసం ఇంకెవరిని అయినా చూసుకోవాల్సింది కానీ ఇలా చేయడం తగదని విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











