ఎన్టీఆర్ హిందీ వాయిస్ ఓవర్ అదుర్స్.. RRR స్పెషల్ వీడియోపై తరణ్ ఆదర్శ్ రివ్యూ
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మూవీ కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కొంత ఉపశమనం లభించింది. కరోనా కష్టాలు మొదలైన నేపథ్యంలో వరుసగా రెండు టీజర్లతో సినీ అభిమానుల్లో రాజమౌళి జోష్ పెంచారు. టైటిల్ ఎనౌన్స్‌తో కూడిన RRR మోషన్ పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేయగా.. శుక్రవారం రాంచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ చేత అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయించారు.
శుక్రవారం 10 గంటలకు రిలీజ్ చేస్తారనుకొన్న వీడియో సాయంత్రం 4 గంటలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఉన్న ఈ సర్‌ప్రైజ్ వీడియోకు బాలీవుడ్ పరిశ్రమ నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందీ వెర్షన్‌లో రిలీజ్ చేసిన వీడియో గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇప్పుడే హిందీ వెర్షన్ అల్లూరి పరిచయ వీడియో చూశాను. హిందీలో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ అదుర్స్. స్పెషల్ వీడియోలో ఎన్టీఆర్ హిందీ యాస ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. ప్రతీ పదాన్ని అద్భుతంగా ఉచ్చరించారు. ఫంటాస్టిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది అని తరున్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











