twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR నుంచి అదిరిపోయే అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్‌కు ఇక పండగే..

    |

    బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి.. భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను ఒకే స్క్రీన్‌పై మన జక్కన్న తీసుకొస్తున్నాడు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌లను వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు.

     వర్కింగ్ టైటిల్‌గా ఆర్ఆర్ఆర్‌

    వర్కింగ్ టైటిల్‌గా ఆర్ఆర్ఆర్‌

    ఈ భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించినప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ ఫుల్ వైరల్ అయింది. జనాల్లోకి ఆర్ఆర్ఆర్ బాగా రీచ్ అవ్వడంతో టైటిల్‌ను కూడా అలానే ఉంచేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం రామ రౌద్ర రుషితం అనే టైటిల్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

    బాలీవుడ్ తారాగణంతో

    బాలీవుడ్ తారాగణంతో

    ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గురువుగా, దారి చూపే పాత్రలో అజయ్ దేవగణ్ నటించనున్నాడు. రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తోంది.

    షూటింగ్‌కు బ్రేక్..

    షూటింగ్‌కు బ్రేక్..

    బాహుబలి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్.. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. దానికోసం జక్కన్న, ప్రభాస్, అనుష్క, రానా, కీరవాణి అందరూ అక్కడికి చేరిపోయారు. దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వచ్చాక రామ్ చరణ్‌తో కీలక సన్నివేశాలు తెరకెకక్కించనున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్...

    ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఫస్ట్ లుక్‌లు విడుదల చేస్తారేమోనని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అయితే తాజాగా ఓ అప్డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.

    కొమురం భీమ్ పుట్టిన రోజు కానుకగా..

    కొమురం భీమ్ పుట్టిన రోజు కానుకగా..

    నేడు కొమురం భీమ్ పుట్టిన రోజు కానుకగా ఓ అప్డేట్‌ను ప్రకటించి చిత్రయూనిట్. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా కనపడనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను నేడు అందరి ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులకు ఇక పండుగే.

    English summary
    Remembering the bravery and grit of revolutionary freedom fighter Sri Komaram Bheem garu on his birth anniversary! We are excited to show you our tarak on the screen as young Bheem in RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X