NTR For SDT: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. వస్తున్నా అంటూ ఎన్టీఆర్ వీడియో వైరల్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే అందులో నందమూరి హీరోలకు అలాగే మెగా హీరోలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది అని వారి మధ్య విభేదాలు కూడా ఉన్నాయని అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఇటీవల RRR సినిమాతో మెగా నందమూరి అగ్ర హీరోలు ఎలాంటి విభేదాలు లేవు అని ఒక క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరొక హీరో కోసం నిలబడిన విధానం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఇక సాయిధరమ్ తేజ్ మొదటిసారి అధికారికంగా ఎన్టీఆర్ చేస్తున్న సపోర్ట్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాలలోకి వెళ్తే..

మెగా హీరోలతో
జూనియర్ ఎన్టీఆర్ దాదాపు అందరికి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా మెగా హీరోలతో కూడా అతనికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. RRR సినిమా రాకముందు నుంచే రాంచరణ్ తో మంచి స్నేహం ఏర్పడింది అని ఆయన పలు ఇంటర్వ్యూలలో తెలియజేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మిగతా హీరోలు కూడా తనకు చాలా క్లోజ్ గా ఉంటారు అని కూడా ఎన్టీఆర్ అన్నాడు.

ఆ సినిమా కోసం
ఎన్టీఆర్ మెగా హీరోలతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా అందుకు సంబంధించిన ఫోటోలను గాని వీడియోలను గాని పెద్దగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. ఎప్పుడూ కూడా వారు ప్రైవేటుగానే ఆ బాండింగ్ ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మెగా హీరోల సినిమాలకు ఎన్టీఆర్ ఇదివరకే ప్రమోషన్స్ లో తన వంతు సహాయం చేశాడు. ఇంతకుముందు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు మరో మెగా హీరో కోసం
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సాయిధరమ్ తేజ్ సినిమా కోసం కూడా తన వంతు సహకారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక విధంగా నందమూరి మెగా అభిమానులకు ఇద్దరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సాయిధరమ్ తేజ్ 15వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఎన్టీఆర్ తన వాయిస్ ను వినిపించబోతున్నాడు. అతని వాయిస్ తోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ రియాక్షన్
ఇక మొత్తానికి ఈ విషయంపై అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్టీఆర్ చేసిన సహాయం గురించి ప్రత్యేకంగా వివరణ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. తారక్ పై మరింత ప్రేమ పెరిగింది.నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నన్ను స్వీకరించిన తీరుకు ధన్యవాదాలు అనేది ఒక చిన్న మాటే అవుతుంది.
నేను నటుడిగా మారడానికి ముందు మిమ్మల్ని కల్సినప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. మీ వాయిస్ మా సినిమాకు అద్భుతంగా సెట్ అయ్యింది. NTR for SDT నాకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది.. అని సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు.

సినిమా విషయానికి వస్తే..
ఇక సాయిధరమ్ తేజ్ 15వ సినిమా విషయానికి వస్తే.. సుకుమారి శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ తో పాటు బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ చాలా నమ్మకంతో ఉన్నాడు మరి ఈ ప్రాజెక్టు అతనికి ఎలాంటి క్రేజ్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











