‘RRR’లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ ఖర్చు, ఎంతంటే?

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత దర్శకుడు రాజమౌళి 'RRR' పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

NTR intro episode cost Rs. 22 Cr in RRR

'RRR' మూవీలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీగా ఖర్చుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ సీన్ కోసమే రూ. 22 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారట. ఈ సినిమా కోసం రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్లను హైర్ చేసుకుంటున్నారు. లైఫ్ ఆఫ్ పై, జంగిల్ బుక్ లాంటి చిత్రాలకు పని చేసిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లు కూడా హైలెట్ అయ్యేలా ఉంటుందని, ఆడియన్స్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుకున్నా దాన్ని అందుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం మరో 10 రోజుల్లో షూటింగులో బిజీ కాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X