ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ వివరాలు.. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ !
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లోనే మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో ఎన్నో విశేషాలు, అంతకు మించిన ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీనితో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించాడు.

దగ్గుబాటి రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రలో, హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ రామ్, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. విద్యాబాలన్ తో పాటు 9 మంది హీరోయిన్లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారందరితో బాలయ్య చేసే సందడి ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











