డీల్ ఓకే.. ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ రిలీజ్ పోస్టర్స్ పడింది!
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ ఇన్‌స్టాల్మెంట్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్స్ విడుదల చేసింది. ఫిబ్రవరి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కావాల్సి ఉండగా... మొదటి భాగం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా అనుకున్న ఫలితాలు ఇవ్వక పోవడంతో సెకండ్ పార్ట్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే సినిమా రిలీజ్ డేట్ అనుకున్న దానికంటే రెండు వారాలు ఆలస్యం అయిందట.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలయ్య తన ' ఎన్.బి.కె ఫిల్మ్స్' బేనర్లో నిర్మించారు. మొదటి భాగంలో ఎన్టీ రామారావు సినీ జీవితానికి సంబంధించిన విశేషాలు చూపించారు. ఇప్పుడు రాబోయే రెండో భాగంలో రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి రావడానికి కారణమైన ముఖ్య ఘట్టాలను ఫోకస్ చేయబోతున్నారు.
'ఎన్టీఆర్- కథానాయకుడు' సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో... వారికే రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' రైట్స్ ఇచ్చారు. దీని ద్వారా వచ్చే వసూళ్లలో 33శాతం పరిహారం కింద డిస్ట్రిబ్యూటర్లు రికవరీ చేసుకుంటారు. ఆపై వచ్చే మొత్తాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పంచుకునేలా డీల్ కుదిరినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











