NTRNeel: భారీ రన్‌టైంతో ఎన్టీఆర్- నీల్ గ్లింప్స్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో తారక్‌ బర్త్‌డేకి మాస్ ట్రీట్!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్నారు. డ్రాగన్ పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ మూవీకి అసలు టైటిల్ వేరే ఉందట. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఎన్టీఆర్ నీల్ సినిమాను నిర్మిస్తున్నారు. 2027 జూన్ 11న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

NTR-Neel Movie Glimpse Runtime Goes Viral Powerful Title To Be Revealed On Birthday

ఎన్టీఆర్- నీల్ మూవీకి సంబంధించి ఒకటి రెండు పోస్టర్స్ తప్పించి కొత్తగా ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో కీలకమైన సన్నివేశాలతో ఎన్టీఆర్ బర్త్ డే రోజున గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ పెంచాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమాలోని ఇతర పాత్రలను రివీల్ చేయకుండా కేవలం ఎన్టీఆర్‌నే ఫోకస్ చేసేలా ఈ గ్లింప్స్‌ని కట్ చేశారట. దీనికి రెండు రోజుల ముందు రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో దాని ప్రభావం పడినా తట్టుకునేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇక ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డ్ నుంచి ధృవీకరణ లభించింది. దీనికి యూ/ఏ 16+ రేటింగ్‌ను జారీ చేశారు. ఈ గ్లింప్స్‌ను దాదాపు 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో కట్ చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సాధారణంగా సినిమా ట్రైలర్లని 3 నిమిషాల లోపే ఉండేలా కట్ చేస్తుంటారు. అలాంటిది గ్లింప్స్‌ను ఏకంగా 4 నిమిషాలకు పైగా నిడివితో వదలడం మామూలు విషయం కాదు. ఇది నిజమైతే.. ఎన్టీఆర్- నీల్ గ్లింప్స్ తెలుగు సినీ పరిశ్రమలోనే సుదీర్ఘమైన గ్లింప్స్ అవుతుంది.

ఈ సినిమాకు డ్రాగన్, డైనోసర్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఇమేజ్, ఫాలోయింగ్‌కు తగినట్లుగా మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ ఫిక్స్ చేశారట. కొందరు మాత్రం ముందు నుంచే ప్రచారంలో ఉన్న డ్రాగన్ అనే టైటిల్‌నే అధికారికంగా ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్- నీల్ గ్లింప్స్‌ను మే 19న అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. తమ హీరో ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు? ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారోనని నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఎన్టీఆర్ - నీల్ గ్లింప్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది.

Read more about: jr ntr dragon prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X