RRR స్టామినా అదే.. వేడెక్కిన గూగుల్ సర్చ్ ఇంజన్

రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాడు. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేస్తున్నాడు జక్కన్న. ఈ దర్శకధీరుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా రాజమౌళి తన ప్రకటనతో సోషల్ మీడియాను షేక్ చేశాడు. దెబ్బకు గూగుల్ కూడా వేడెక్కిపోయినట్టు తెలుస్తోంది.

ఊరిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ జోడి..

ఊరిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ జోడి..

తొలుత ఎన్టీఆర్‌కు జోడిగా.. డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ అనే హాలీవుడ్‌ భామ నటిస్తున్నట్టుగా ప్రకటించాడు జక్కన్న. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికే పనిలో ఉంది రాజమౌళి టీం. ఒకపక్క షూటింగ్ పనులు కానిచ్చేస్తూనే మరో పక్క హీరోయిన్‌ కోసం వేట కొనసాగించింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తూ వచ్చిన టీమ్.. ఎట్టకేలకు ప్రకటించేసింది.

ఎన్టీఆర్ జోడిగా ఆమె..

ఎన్టీఆర్ జోడిగా ఆమె..

ఫైనల్‌గా ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికి పట్టుకుంది ఆర్ఆర్ఆర్‌ టీం. ఆమె ఫోటోతో పాటు క్యారెక్టర్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. లండన్‌కు చెందిన ఓలివియా మోరీస్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా జెన్నీఫర్‌ పాత్రకు ఫైనల్‌ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓలివియా పలు టీవీ షోస్‌లోనూ నటించిందని తెలిపారు.

విలన్ల పాత్రలూ రివీల్..

విలన్ల పాత్రలూ రివీల్..

విలన్‌గా ఐరిష్ యాక్టర్‌ రే స్టీవెన్సన్‌ నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రే బ్రిటీష్ అధికారి స్కాట్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రఖ్యాత థార్‌ సిరీస్‌లో నటించిన రే స్టీవెన్సన్‌.. పలు టెలివిజన్‌ షోస్‌లో కీలక పాత్రల్లో నటించాడు. తొలిసారిగా ఓ రీజినల్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు రే. అలాగే, ఈ సినిమాలో లేడీ విలన్ కూడా ఉంది. ఆ పాత్ర పేరు లేడీ స్కాట్. ఈ పాత్రలో 53 ఏళ్ల ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాలు, టీవీ సిరీస్‌లలో నటించిన అలిసన్.. RRR ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నట్లు తెలిపారు.

ఈ ప్రకటనతో ప్రకంపనలు

సినిమాల్ని తెరకెక్కించడంలో మాస్ పల్స్ తెలిసిన జక్కన్నకు.. దానికి భారీ హైప్ తీసుకురావడంలోనూ కొత్త పుంతలు తొక్కుతాడు. ప్యాన్ ఇండియా సినిమాగా బాహుబలికి ఎక్కడా లేని పాపులారిటీ తీసుకొచ్చిన రాజమౌళి..ఇప్పుడు RRR సినిమాకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డాడు. క్యాస్టింగ్ దగ్గరి నుంచే సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. RRR సినిమాలో హాలీవుడ్ క్యాస్టింగ్‌ను తీసుకున్న రాజమౌళి.. వారి పేర్లను ప్రకటించడం దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించాడు.

వేడెక్కిన గూగుల్ సర్చ్ ఇంజిన్..

వేడెక్కిన గూగుల్ సర్చ్ ఇంజిన్..

ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్ పాత్రలో 'ఒలీవియా మోరిస్',బ్రిటీష్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్‌సన్,లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నట్టు ప్రకటించడంతో.. గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ వీరి గురించి వెతకడం మొదలుపెట్టారట. గతంలో వీరు చేసిన సినిమాలు.. వీరికున్న పాపులారిటీ గురించి సెర్చ్ చేశారట. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒలీవియా మోరిస్ పేరు ఇండియాలో ఎక్కువసార్లు ట్రెండ్ అయిందని ఆర్ఆర్ఆర్ బృందం ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే దాదాపు 2లక్షల సార్లు ఆమె పేరును గూగుల్‌లో సెర్చ్ చేశారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X