రాంచరణ్, ఎన్టీఆర్, అఖిల్ ఒకే చోట.. పార్టీ రచ్చ రచ్చ

టాలీవుడ్ హీరోల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ అందర్నీ ఆకట్టుకొనేలా ఉంటున్నది. స్టార్ హీరోలు తమ ఇగోలను పక్కన పెట్టి ఒకరి సినిమా కోసం మరొకరు సపోర్టుగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఇతర హీరోలు సినిమాల ఫంక్షన్లో పాల్గొని ప్రమోట్ చేస్తుండటంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను సినిమా వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిస్టర్ మజ్ను సినిమా విజయాన్ని ఆకాంక్షించారు కూడా. ఈ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

NTR, Ram Charan, Akhil Akkineni at Mr Majnu Party

మిస్టర్ మజ్ను సినిమా వేడుక తర్వాత జరిగిన పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్‌తో రాంచరణ్ జతకలిశాడు. ఈ పార్టీకి నాగార్జున‌తోపాటు ఈ ముగ్గురు హీరోలు కలవడంతో రచ్చరచ్చగా మారిందట. పార్టీలో వీరి కలయిక స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ముగ్గురు హీరోలు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X