RRR ట్రైలర్ లో ఇది గమనించరా.. రామ్ చరణ్ మొహం మీదే కొట్టిన తారక్.. స్లో మోషన్ లో అరాచకం!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శక ధీరుడు రాజమౌళి ఒక సరికొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొట్టమొదటిసారి అత్యధిక ఫాలోయింగ్ ఉన్నటువంటి మెగా నందమూరి హీరోలను ఒకే తెరపై చూపిస్తూ ఉండడం విశేషం అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఇదివరకే ఒకసారి క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే సినిమాలో కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ప్రేక్షకుల ఊహకే వదిలేశాడు

ప్రేక్షకుల ఊహకే వదిలేశాడు

బాహుబలి లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా టీజర్స్ తో పాటు ఇప్పుడు ట్రైలర్ కూడా అంతకు మించి అనేలా బజ్ క్రియేట్ చేసింది. మూడు నిమిషాలు ట్రైలర్ తో దర్శకుడు సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకుల ఊహకే వదిలేశాడు.

ఫుల్ మీల్స్ రెడీ

ఫుల్ మీల్స్ రెడీ

రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి తెరపైకి తీసుకు వస్తాడు అని మరోసారి నిరూపించినట్లు తెలుస్తోంది. RRR సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో ప్రతి షాట్ కూడా అద్భుతంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. దేశభక్తి తో పాటు ఎమోషన్స్ ఫ్రెండ్షిప్ యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఎలివేషన్స్ అన్ని కూడా ఒకే ప్లేట్లో ఫుల్ మీల్స్ తరహాలో సెట్ చేసినట్లు అర్థమవుతోంది.

స్లో మోషన్ లో..

స్లో మోషన్ లో..

ఇక సినిమా ట్రైలర్ లో చాలామంది ఊహించని కొన్ని షాట్స్ చాలా మిల్లీ సెకండ్స్ లో దర్శకుడు పొందుపరిచాడు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ ఆ సన్నివేశాలను స్లో మోషన్ లో చూస్తూ మరింతగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కు సంబంధించిన ఫైట్ (1:56) సన్నివేశాలు 0.25 స్పీడ్ లో చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మినీ ఫిలిమ్ చూసినట్లుగా ఉందని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి.

 స్నేహంలో శత్రుత్వం

స్నేహంలో శత్రుత్వం

అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న రామ్ చరణ్ తేజ్ పవర్ఫుల్ లుక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర కూడా అంతకు మించి అనేలా ఉంది. ఇక మొదట ఈ ఇద్దరు స్నేహితులుగా కనిపించి ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వలన శత్రువులు గా మారతారు. అనంతరం విప్లవంతో ఒకటవుతారు. ఈ సన్నివేశాలతో దర్శకుడు అనేక రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేసినట్టు అర్థమవుతుంది.

చరణ్ మొహం మీద కొట్టిన ఎన్టీఆర్

చరణ్ మొహం మీద కొట్టిన ఎన్టీఆర్

అయితే బ్రిటిష్ రాజ్యంలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి రామరాజు ఆ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన కొమురం భీం ఎలా అడ్డుకున్నాడు పాయింట్ కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ తరుణంలో వీరిద్దరూ ఈ విధంగా సన్నివేశం కూడా ఆసక్తి రేపుతోంది ఒక షాప్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొహం మీద కర్ర తీసుకుని కొట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. వీరిద్దరు కలిసి ఒక సన్నివేశంలో చాలా ఎమోషనల్ గా కట్ చేస్తారు అని అర్థమవుతుంది. ఇదివరకే ఈ విషయంపై రచయితకే విజయేంద్రప్రసాద్ కూడా చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు.

Recommended Video

RRR Trailer : Have You Observed This In The Trailer ? || Filmibeat Telugu
అరాచకం అనేలా...

అరాచకం అనేలా...

ఒక తల్లి బిడ్డలు కొట్టుకుంటే ఆ తల్లి ఏ విధంగా బాధ పడుతుందో అదేవిధంగా ప్రేక్షకులు కూడా బాధ పడతారు అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చాలా వివరంగా తెలియజేశారు. చూస్తుంటే సన్నివేశం ప్రేక్షకులను గుండెను తాకేలా ఉంటుంది అని కూడా అర్థం అవుతోంది. ఇక చివర్లో అయితే కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు కలిసి పోరాడిన సన్నివేశాలు అరాచకం అనేలా ఉన్నాయి. బాక్సాఫీస్ కుంభస్థలన్ని ఎలా కొడతారో తెలియాలి అంటే జనవరి 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X