ఎన్టీఆర్ కంటే ముందుగానే చరణ్.. 'ఆర్ఆర్ఆర్' లేటెస్ట్ అప్డేట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, రాంచరణ్‌పై రాజమౌళి యాక్షన్ సన్నివేశాలు తెరక్కిస్తున్నాడు. తొలి షెడ్యూల్‌లోనే రాజమౌళి కీలకమైన ఫైట్ సీన్ ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కంటే ముందుగానే రాంచరణ్ తన భాగాన్ని పూర్తి చేయనున్నాడట.
ఈ నెల 11 న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి. స్వాతంత్రం రాక ముందు పరిస్థితుల నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కథని సిద్ధం చేశారట. రాంచరణ్ ఈ చిత్రం పోలీస్ పాత్రలో, ఎన్టీఆర్ బందిపోటు పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్లని ఇంకా నిర్ణయించలేదు. విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు, ఇతర నటీనటులు ఎవరు లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. బాహుబలి చిత్రం తరువాత ఇద్దరు బడా హీరోలతో రాజమౌళి సినిమా చేస్తుండంతో ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని కథ అందిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











