18 ఏళ్ల క్రితం గజాలా.. ఇప్పుడు రాజమౌళి.. అనుకోకుండా జరిగింది.. ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. కెరీర్ మొదట్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను, తన తాజాగా RRR ను ప్రస్తావిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయింది. ఇంతకీ ఎన్టీఆర్ చేసిన ఆ ట్వీట్ ఏంటి? అందులో ఏముంది? వివరాల్లోకి పోతే..

కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్

నందమూరి నట వారసుడిగా వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేసిన ఎన్టీఆర్‌కి కెరీర్ ఆరంభంలోనే స్టూడెంట్ నెంబర్ 1 రూపంలో భారీ హిట్ పడింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమా ఏకంగా ఏడాది పాటు థియేటర్స్‌ని హోరెత్తించింది.

రాజమౌళి RRRలో ఎన్టీఆర్

రాజమౌళి RRRలో ఎన్టీఆర్

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సక్సెస్ సాధించిన రాజమౌళి- ఎన్టీఆర్ జోడీ ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో అలరించారు. మళ్ళీ ఇప్పుడు RRR అనే భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

 18 ఏళ్ల క్రితం షూటింగ్.. ఇప్పుడు రాజమౌళి

18 ఏళ్ల క్రితం షూటింగ్.. ఇప్పుడు రాజమౌళి

ఈ నేపథ్యంలో 2001లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ఇదే రామోజీ ఫిలింసిటీలో తీసిన ఓ సన్నివేశాన్ని, ఇప్పుడు RRR కోసం తీయబోతున్న ఓ సన్నివేశాన్ని పోల్చుతూ రేర్ పిక్ షేర్ చేశారు ఎన్టీఆర్. సరిగ్గా 18 ఏళ్ల క్రితం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేసాం.. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ రోజు అదే రామోజీ ఫిలింసిటీలో షూట్ చేస్తున్నాం.. యాదృచ్చికంగా జరిగిందని పేర్కొంటూ ఓ పిక్ షేర్ చేశారు ఎన్టీఆర్.

ఎన్నో మార్పులు కానీ అదొక్కటి మాత్రం

ఇందులో అప్పుడు గజాలతో షూట్ చేసిన ఓ పిక్, ఇప్పుడు అదే స్పాట్‌లో గజాలా స్థానంలో రాజమౌళితో దిగిన పిక్ కలిపారు ఎన్టీఆర్. ఈ మేరకు ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ రాజమౌళితో షూటింగ్ చేస్తున్నపుడు కలిగే ఫన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు ఎన్టీఆర్. ఈ పోస్ట్ చూసి మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.

RRR మూవీ

RRR మూవీ

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X