దిమ్మతిరిగేలా అరవింద సమేత బిజినెస్.. ఎన్టీఆర్ ఆ రికార్డు కొట్టాలంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ. క్రేజీ కాంబినేషన్‌లో ఈ చిత్రం వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాలకు తగినట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.92 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ రేంజ్‌లో బిజినెస్ జరుగడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం, సీడెడ్‌లో హక్కులు
తెలుగు రాష్ట్రాల్లో నైజాం బిజినెస్ చాలా కీలకమైంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను భారీ మొత్తం పలికాయి. సుమారు రూ.19 కోట్ల చెల్లించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకొన్నారు. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ రూ.15 కోట్లు పలికాయి.

ఆంధ్రాల్లో అరవింద ప్రీ బిజినెస్
ఇక ఆంధ్రాకు సంబంధించి.. వైజాగ్‌లో హక్కులు రూ.9.2 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.4.8 కోట్లు మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. గుంటూరు జిల్లా హక్కులను రూ.7.2 కోట్లు, కృష్ణా రూ.5.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.3 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

ఇతర రాష్ట్రాల్లో బిజినెస్
అరవింద సమేత కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రూ.8.2 కోట్లకు అమ్ముడుపోయాయి. కర్ణాటక మినహాయించి ఇతర రాష్ట్రాల్లో రూ.1.3 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ హక్కులు రూ.12.5 కోట్ల మేర పలికాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్
ఓవరాల్‌గా నైజాం, ఏపీ మొత్తం కలిపి రూ.70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే అన్ని ఏరియాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూ.92 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.

హిట్ నుంచి బ్లాక్‌బస్టర్‌గా మారాలంటే
ఇలాంటి గణాంకాల నేపథ్యంలో అరవింద సమేత చిత్రం హిట్టు టాక్ సంపాదించుకోవాలంటే కనీసం 92 నుంచి 110 కోట్ల నికర వసూళ్లను సాధించాలి. సూపర్ హిట్ సాధించాలంటే రూ.110 నుంచి 137 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టలి. ఇక బ్లాక్‌బస్టర్ టాక్ రావాలంటే రూ.138 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించాలి.

ఎన్టీఆర్‌కు సవాల్‌గా
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే గ్రాస్‌గా రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన రికార్డు యంగ్ టైగర్‌కు ఉంది. కానీ టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన రూ.75 కోట్ల మార్కును అధిగమించలేకపోయాడు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ ఈ మైలురాయిని అధిగమించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











