ఆ విషయంలో ఎన్టీఆర్ టాప్.. పవన్, మహేష్ లను వెనక్కి నెట్టి మరీ!
ఒకప్పుడు చేసే సినిమాలను బట్టి స్టార్స్ కి ఉన్న ఫాలోయింగ్ గుర్తించేవారు. ఆ సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనే లెక్కలు వేసుకుని అప్పుడు స్టార్స్ రేంజ్ ఏంటో అంచనా వేసే వారు. కానీ ఇప్పుడు లెక్కల మారి పోయాయి. స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో ఉన్న వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి లెక్కలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో గత వారం రోజులుగా ట్విట్టర్లో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో నిలవడం ఆసక్తికరంగా మారింది ఆ వివరాల్లోకి వెళితే.

లెక్కలు మారాయి
సాధారణంగా ఫ్యాన్స్ అలాగే ఇతర అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ హీరోల ట్విట్టర్ అకౌంట్లు మెన్షన్ చేసి అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. అలా గత వారం రోజులుగా ఎవరికి ఎక్కువ మెన్షన్ లు వచ్చాయి అనే విషయం చూసుకుంటే అందరికంటే ముందు ప్లేస్ లో ఎన్టీఆర్ నిలిచాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలను వెనక్కినెట్టి ఆయన ఏకంగా ఒక మెన్షన్ లతో టాప్ ప్లేస్ లో నిలిచారు..

టాప్ లో ఎన్టీఆర్
ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివతో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.. నిజానికి ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నా అనుకోని కారణాలతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఈ సినిమాలో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ నటించనుందని ప్రచారం జరిగుతున్న సంగతి తెలిసిందే.

ప్యాన్ ఇండియా హీరో
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా క్రేజ్ వస్తుందని భావిస్తున్న ఆయన ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో చేస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ను కూడా ఫైనల్ చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.

లెక్కలు ఇవే
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కి ఏకంగా ఒక మిలియన్ మెన్షన్స్ రాగా అందులో దాదాపు సగం మెన్షన్స్ మాత్రమే మహేష్ బాబుకు లభించాయి. ఆయనకు కేవలం 560K మెన్షన్స్ లభించాయి, అల్లు అర్జున్ కి 555K మెన్షన్స్ లభించాయి, అలాగే పవన్ కళ్యాణ్ కి 420K మెన్షన్స్, రామ్ చరణ్ కి 290K మెన్షన్స్ లభించాయి.

సినిమాల విషయానికి వస్తే
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. మరోపక్క రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో పాటు కొరటాల శివ ఆచార్య సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











