అల్లు అర్జున్ కథతో.. ఎన్టీఆర్ సినిమా.. త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ అప్పుడే!

టాలీవుడ్‌లో గత రెండేళ్లుగా చర్చనీయంగా మారిన అంశం గాడ్ ఆఫ్ వార్ (God of War).'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబో కలిసి పని చేయబోతున్నట్లు చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అంతేకాదు, మధ్యలో ఈ కథను త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో తెరకెక్కించబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. దీంతో త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, తాజాగా ఆ అన్ని ఊహాగానాలకు తెరపడే సమయం వచ్చేసింది.

నిర్మాత నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒకే ఒక్క పోస్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రేపే" అంటూ నెమలి ఎమోజీతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ వెంటనే నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కూడా ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బిగ్ అనౌన్స్‌మెంట్ వస్తుందని ప్రకటించింది. దీంతో అది 'గాడ్ ఆఫ్ వార్' గురించేనని అభిమానులు దాదాపు ఫిక్స్ అయిపోయారు.

NTR-Trivikram God of War Announcement Is the Mythological Story Once Planned for Allu Arjun

అల్లు అర్జున్ పేరు ఎందుకు వచ్చింది?
వాస్తవానికి త్రివిక్రమ్ మొదట ఈ మైథలాజికల్ కాన్సెప్ట్‌ను ఎన్టీఆర్‌కే చెప్పారని ఇండస్ట్రీ టాక్. అయితే దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ వంటి ప్రాజెక్ట్‌లతో ఎన్టీఆర్ బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ మరో సినిమా చేయనున్నట్లు ప్రకటన రావడంతో, అదే ఈ మైథలాజికల్ కథ అని పుకార్లు మొదలయ్యాయి. కానీ, తర్వాత బన్నీ కోసం పూర్తిగా కొత్త కథను సిద్ధం చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ కోసం అనుకున్న కథ మళ్లీ ఎన్టీఆర్ చేతిలోకే వచ్చినట్లు భావిస్తున్నారు.

గాడ్ ఆఫ్ వార్'.. కుమారస్వామి కథేనా?
ఈ సినిమాపై జరుగుతున్న అతిపెద్ద చర్చ ఏంటంటే.. ఇది సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి/మురుగన్) ఇతివృత్తంతో రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా అనే ప్రచారం. గతంలో నాగవంశీ సోషల్ మీడియాలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాన్ని షేర్ చేయడం, ఇప్పుడు నెమలి ఎమోజీని ఉపయోగించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. పురాణాల్లో నెమలి కుమారస్వామి వాహనం కావడం విశేషం. అంతేకాదు, గత ఏడాది ముంబై విమానాశ్రయంలో ఎన్టీఆర్ చేతిలో 'మురుగ' అనే పుస్తకం కనిపించడం కూడా ఈ ఊహాగానాలకు దారితీసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అప్పుడే రీసెర్చ్ మొదలుపెట్టారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే మూవీ మేకర్స్ అధికారికంగా ధృవీకరించలేదు.

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. త్రివిక్రమ్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే కాంబో మైథలాజికల్ జానర్‌లో సినిమా చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. త్రివిక్రమ్ తొలిసారి పూర్తి స్థాయి పౌరాణిక కథను తెరకెక్కించనున్నారనే ప్రచారం కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారట.

ఈ ప్రతిష్టాత్మక సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైథలాజికల్ జానర్‌లో ఇప్పటివరకు చూడని స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్నదే మూవీ యూనిట్ లక్ష్యమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: allu arjun ntr trivikram srinivas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X