NTR Vs Ram Charan Fan War: ఎన్టీఆర్ దేవరపై రాంచరణ్ కామెంట్స్.. ఫ్యాన్ వార్ ముగిసేనా?
NTR Vs Ram Charan Fan War: దేవర.. దేవర.. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా 'దేవర' సినిమా ముచ్చట్లే. ఎక్కడ నలుగురు కలిసిన దేవర మూవీ గురించే చర్చిస్తున్నారు. అంతలా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. 2024లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో 'దేవర' ఒకటి అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ 27న (రేపు) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. ఈ తరుణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మెగా vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ ముగిస్తుందా? ఇంతకీ ఏం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీని ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. తారక్ సినిమాల్లో వన్ ఆఫ్ ది భారీ బడ్జెట్ మూవీగా చెప్పవచ్చు. ఈ భారీ బడ్జెట్ మూవీకి జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

ఇలా ఎన్టీఆర్ ఆరేండ్ల తరువాత సోలో హీరోగా నటించడం, ఈ మాస్ మూవీలో టాలీవుడ్,బాలీవుడ్ లోని స్టార్ యాక్టర్ నటించడం, అలాగే ఇప్పటివరకు దేవర మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ భారీ రెస్పాన్స్ వస్తుండటం, ఇప్పటికే మూవీ ట్రైలర్స్ పలు రికార్డులను బ్రేక్ చేయడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మా హీరో ఖాతా మరో బస్టర్ మూవీ పడబోతుందనీ, కలెక్షన్ల పరంగా గత రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని భారీ అంచనాలు పెంచుకున్నారు.
ఇదిలాఉంటే.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా మెగా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరోనే గొప్ప అని కామెంట్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ వార్ ఇప్పటిది కాదు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ సమయం నుంచి నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు ఎంటర్టైన్ చేస్తే.. ఫ్యాన్స్ మాత్రం చరణ్ కెరెక్టర్ గొప్ప అంటూ ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడడంతో ఈ వార్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడంతోనే రామ్ చరణ్ ఆచార్య డిసాస్టర్ అయిందనే కామెంట్స్ అప్పటో తెగ వైరల్ అయినా విషయం తెలిసిందే.

ఇప్పడు ఆ కామెంట్స్ ను తెరపైకి తెస్తూ.. మెగా ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడుకుంటే.. మీ హీరోకు సింగల్ గా హిట్ కొట్టే సత్తా లేదనీ, దేవర మూవీ పక్కా ఫ్లాప్ అటు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ న్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తగ్గేదేలా అన్నట్టు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్స్, దేవర పోస్టర్స్ ను పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కరిని ఒక్కరూ కామెంట్స్, ట్రోల్స్ చేసుకుంటున్నారు మెగా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సమయంలో రామ్ చరణ్ గానీ, ఎన్టీఆర్ గానీ ఏదొకటి చేయాలని, ఈ ఫ్యాన్ వార్ కు పుల్ స్టాప్ పెట్టాలని చాలా మంది భావించారు. ఈ తరుణంలో మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా ఓ ట్వీట్ చేశారు.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ మధ్య మంచి అనుబంధముంది. 'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటించాక వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. తాజాగా ఎన్టీఆర్ నటించిన 'దేవర' రేపు(సెప్టెంబర్ 27) థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ''దేవర విడుదల సందర్భంగా నా సోదరుడు తారక్ కి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జూనియర్ ఎన్టీఆర్ ను నా సోదరుడు అంటూ మెగా హీరో రామ్ చరణ్ సంభోదిస్తూ.. దేవర టీమ్ మొత్తానికి పేరు పేరునా ఆల్ ద బెస్ట్ చెప్పాలంటే.. ఫ్యాన్ ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా ఫ్యాన్ వార్ ముగించడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











