NTRNeel: డ్రాగన్‌లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ లీక్.. ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఊరమాస్ గెటప్

దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేసిన తారక్.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బలమైన పునాదులు వేసుకోవాలని భావించారు. అయితే ఎన్టీఆర్ ఆశలు అడియాశలు ఆయ్యాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న తారక్‌కు దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వార్ 2 డిజాస్టర్‌గా నిలిచింది. నందమూరి అభిమానులు ఇంకా వార్ 2 రిజల్ట్‌ను మరిచిపోలేకపోతున్నారు. ఈ సినిమా దెబ్బకు తెలుగులో వార్ 2ను రిలీజ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆర్ధికంగా బాగా నష్టపోయారు. దాంతో తారక్ ఫ్యాన్స్ తమ హీరో ఓ సాలీడ్ హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు.

అనిల్ కపూర్ కీలకపాత్ర
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంతార చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, ప్రియదర్శి పులికొండ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఎన్టీఆర్ నీల్ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న ఎన్టీఆర్ నీల్ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

NTRNeel Jr NTR s new look with rugged beard viral on social media

డ్రాగన్ స్టోరీ ఇదేనా?
ఇక ఎన్టీఆర్ నీల్ మూవీ స్టోరీ అన్న విషయంలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రధానంగా 1950, 60 దశకాలలో ఇండియా, బర్మా, మయన్మార్, థాయిలాండ్, నార్త్ లావోస్ ప్రాంతాల సరిహద్దులను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్‌గా వ్యవహరించారు. ఈ ప్రాంతంలో మాఫియా కనుసన్నుల్లోనే డ్రగ్స్ ఎగుమతి, దిగుమతులు జరిగేవి. ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఓ సామాన్యుడు లీడర్‌గా ఎలా ఎదిగాడు అన్నదే డ్రాగన్ కథగా వార్తలు వస్తున్నాయి. మాఫియా, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి బ్యాక్ డ్రాప్‌లో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ ఉంటాయని చెబుతున్నారు.

డ్రాగన్ ఆగిపోయిందంటూ గాసిప్స్
అయితే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఆగిపోయిందని పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్య అది కాస్తా ఎక్కువైంది. తన లుక్‌పై ఎన్టీఆర్ అభ్యంతరం తెలపడంతో పాటు సెకండాఫ్‌లో కొన్ని మార్పులు సూచించినట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ యూనిట్ మాత్రం వీటిని పట్టించుకోకుండా సైలెంట్‌గా పనిచేసుకుంటూ వెళ్తోంది. ముందుగా అనౌన్స్ చేసిన సమయానికే సినిమా వస్తుందని చెబుతున్నారు. నవంబర్ చివరిలో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ తిరిగి పట్టాలెక్కబోతోందని.. యూరప్‌లో నెక్ట్స్ షెడ్యూల్ జరుగుతుందని, అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్
ఇదిలాఉండగా.. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు? ఆయన లుక్ ఎలా ఉంటుంది? అనే దానిపై సోషల్ మీడియాలో తారక్ అభిమానులు తెగ డిస్కస్ చేస్తున్నారు. దీనికి చెక్ పడేలా ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఇటీవల వెయిట్ లాస్‌పై ఫోకస్ పెట్టారు. తన బావమరిది పెళ్లి వేడుకతో పాటు కాంతార చాప్టర్ 1 ఈవెంట్‌లోనూ చాలా స్లిమ్‌గా, బక్కచిక్కిపోయి కనిపించడంతో తమ హీరోకి ఏమైందా? అని అభిమానులు షాక్ అయ్యారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్లూ జీన్స్, చెక్ షర్ట్, దానిపైన బ్లాక్ కలర్ జాకెట్ ధరించారు. గతంతో పోలిస్తే కాస్త బరువు పెరిగిన తారక్... గుబురుగా గడ్డం పెంచి కనిపించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తూ మీసం తిప్పుతూ అభిమానులకు ఫోజులిచ్చారు తారక్. ప్రస్తుతం ఆయన స్టైలీష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తారక్‌ని స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: dragon prashanth neel jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X