'11'వ నెంబర్ సెంటిమెంట్ .. అల్లు అర్జున్‌కి కూడా తప్పలేదా? ఇంతలా వెంటాడిందా?
ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక నెంబర్ మంచి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఆ నెంబర్ ఒక ఎమోషన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏపీలో జరిగిన ఎన్నికల్లో సినిమాలకి సంబంధించి కూడా పలు రసవత్తర పరిస్థితులే నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో జరిగిన రచ్చలో సర్ప్రైజింగ్ గా నెంబర్ 11 ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. కాగా ఏపీలో ఇపుడు ఈ నెంబర్ కి ఒక ప్రత్యేకత నెలకొనగా ఇపుడు ఇదే నెంబర్ సెంటిమెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని వెంటాడుతుంది అని సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన భారీ చిత్రం పుష్ప 2 రికార్డు వసూళ్లతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కాంట్రవర్సీ కూడా రేపింది.

దీనితో అక్కడి నుంచి మొదలైన ఈ రచ్చ ఇపుడు ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండేలా చేసింది. మన తెలుగువారు కొన్ని సెంటిమెంట్‌లని బాగా ఫాలో అవుతారు. అలాగే ఒకటే ఘటన రెండు మూడు సార్లు జరిగింది అంటే దానిని మరింత వైరల్ చేస్తారు. ఇలా మరోపక్క అల్లు అర్జున్ కి ఇపుడు బ్యాడ్ టైం నడుస్తుంది అని చాలా కామెంట్స్ వినిపించాయి.
కానీ ఈ బ్యాడ్ టైం కి ఏపీలో వైరల్ అయ్యిన 11 నెంబర్ కి లింక్ పెట్టేస్తున్నారు కొందరు. అసలు అల్లు అర్జున్ విషయంలో ఇంత నెగిటివ్ కానీ ఇతర అంశాల్లో హాట్ టాపిక్ గా మారడానికి కానీ నాంది నంద్యాల ఇన్సిడెంట్ అని అందరికీ తెలుసు. అక్కడ నుంచే అసలు రచ్చ మొదలు కాగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం వెళ్లిన తేదీ మే 11, ఇక్కడి నుంచి మొదలైన 11 సెంటిమెంట్ బన్నీని వెంటాడుతోందట.

తాను సపోర్ట్ ఇచ్చిన స్నేహితుడి పార్టీ 11 సీట్లు తెచ్చుకుంది. సంధ్య థియేటర్ ఘటన కూడా సుమారు రాత్రి 11 గంటల సమయంలోనే జరిగింది. అలాగే ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు ఇచ్చి పోలీసు స్టేషన్ కి హాజరు కావాలని ఇచ్చిన సమయం కూడా ఉదయం 11 గంటలు. దీనితో పాటు అల్లు అర్జున్‌ని సంధ్య థియేటర్ ఘటనలో A 11 గా చేర్చడం ఇలా పలు అంశాలు కలిసినట్టుగా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది
ఇదే కాకుండా అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఓ షాట్ లో కూడా 11 నెంబర్ కనిపిస్తుంది. ఇలా అల్లు అర్జున్ వెనుక ఈ నెంబర్ వెంట పడుతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. సో ఇది.. అల్లు అర్జున్‌ని వెంటాడుతున్న 11వ నెంబర్ కథ. మరోవైపు పుష్ప 2 మాత్రం భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది.


Click it and Unblock the Notifications











