మహేష్ బాబు ‘మహర్షి’ సెకండ్ సింగిల్ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. సూపర్ స్టార్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు.
ఇప్పటికే ఫ్రెండ్షిప్ నేపషథ్యంలో సాగే 'చోటి చోటి బాతే' అనే తొలి సాంగ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా సెకండ్ సింగల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 'నువ్వే సమస్తం' అంటూ సాగే
ఆ పాటను శుక్రవారం(ఏప్రిల్ 12) సాయంత్ర 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు.
'మహర్షి' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 'నువ్వే సమస్తం' పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. తొలి పాటకు భిన్నంగా సెకండ్ సాంగ్ ఉంటుందని, ఈ సాంగ్ రిషి పాత్రను ప్రజెంట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన 'మహర్షి' టీజర్ 24 గంటల్లో 12.6 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఈ టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి మహేష్ బాబు స్టైలిష్ లుక్ హైలెట్ అయ్యేలా ఇది ఉండటమే కారణం.
'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











