నువ్వు తోపురా హీరోకు రోడ్డు ప్రమాదం.. అందంతా అవాస్తవం.. దర్శకుడు హరినాథ్

శేఖర్ కమ్ముల దర్వకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన సుధాకర్ కోమాకుల కు భారీ ముప్పు తప్పింది. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న నువ్వు తోపురా సినిమా బృందం కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి దర్శకుడు హరినాథ్‌బాబు తెలుగు ఫిల్మీబీట్‌కు ఫోన్‌లో వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేము ప్రయాణిస్తున్న కారు మంగళగిరికి సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పింది. ఈ ఘటనలో మునిసిపల్ కార్మికురాలు ప్రమాదానికి గురై మరణించింది అని తెలిపారు. ట్యాంకర్‌ను తప్పించబోగా రోడ్డుపైకి వచ్చిన మునిసిపల్ కార్మికురాలిని కారు ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో హీరో సుధాకర్ కారు నడుపుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నారు.

Nuvvu Topura director Harinath Babu about Accident

డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న సుధాకర్‌ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో హాస్పిటల్‌లో చికిత్స జరుగుతున్నది అని డైరెక్టర్ హరినాథ్ తెలిపారు. నువ్వుతోపురా సినిమా బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతురాలి బాడీని పోస్టు మార్టమ్‌కు పంపించారు. గాయపడిన హీరో సుధాకర్, దర్శకుడు హరినాథ్, హీరోయిన్‌కు ప్రాథమిక చికిత్స అందించినట్టు సమాచారం.

Nuvvu Topura director Harinath Babu about Accident

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X