For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ పై దాడి కాదు, వ్యవస్థపై దాడి'.. ఏం చేయాలి అనుకుంటున్నారు? చెప్పండి .. నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఫైర్!

  |

  రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూడాలనే ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణలో సినిమాకు బెనిఫిట్ షో వేసుకునే అవకాశం ఇవ్వడమే కాక రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  చర్చనీయాంశంగా

  చర్చనీయాంశంగా


  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా టికెట్ రేట్లు థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  పోలీసులతో పాటు

  పోలీసులతో పాటు

  జీవో నెంబర్ 35 ప్రకారమే సినిమా ప్రదర్శించాలని అదనపు షో లు వేసినా అధిక ధరల టికెట్లు అమ్మినట్లు తెలిసినా థియేటర్లను సీజ్ చేస్తామని చెబుతూ థియేటర్ల వద్ద రెవెన్యూ సిబ్బంది పహారా కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యాత్మకం అవుతాయి అని భావిస్తున్న కొన్నిచోట్ల అయితే పోలీసులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి వెళ్లి థియేటర్ల వద్ద కూర్చుని డ్యూటీ చేస్తున్నారు.

  ఎన్ వి ప్రసాద్

  ఎన్ వి ప్రసాద్


  కొన్ని చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా వినియోగిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది సినిమా నిర్మాతలు, ఆర్టిస్టులు మీద జరుగుతున్న దాడి కాదు అని అభివర్ణించిన ఆయన థియేటర్ వ్యవస్థ మీద జరుగుతున్న దాడి అని అన్నారు.

  ఎగ్జిబిటర్లు వ్యవస్థ పై దాడి

  ఎగ్జిబిటర్లు వ్యవస్థ పై దాడి

  రాష్ట్రంలో థియేటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేసిన ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలి అనుకుంటే అది రాజకీయంగా చేయాలి కానీ ఇలా థియేటర్ ల మీద ఆంక్షలు విధిస్తూ ధియేటర్లకు ఊపిరి సలపకుండా చేస్తే ఎగ్జిబిటర్లు వ్యవస్థకు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. థియేటర్ల పై చేస్తున్న దాడి కరెక్ట్ కాదు అని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మీ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కూడా మీ వాళ్ళే కదా అని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన కామెంట్ చేశారు. ఇప్పటికే మూడు సార్లు కరోనా కారణంగా ఇబ్బందులు పడ్డామని దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఎగ్జిబిటర్లు వ్యవస్థ పై దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అన్నారు.

   థియేటర్ల మీద చేస్తున్న దాడి

  థియేటర్ల మీద చేస్తున్న దాడి

  10 గంటల వరకు ఎలాంటి షో వేయకూడదు అని నోటీసు ఇస్తే ఆ నోటీసులు అనుగుణంగా సైలెంట్ గా ఉన్నాము కానీ అధికారులు మళ్లీ మళ్లీ థియేటర్ల మీద దాడి చేస్తూ మమ్మల్ని దొంగలలా చూస్తున్నారని ఆయన బాధపడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎగ్జిబిటర్లను మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు? ఓపెన్గా చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని ప్రసాద్ నిలదీశారు. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలి అనుకుంటే అది మీ వ్యక్తిగతంగా చేసుకోండి కానీ ఇలా థియేటర్ వ్యవస్థ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు. థియేటర్ల మీద దాడి చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్న ఆయన ఇది పవన్ కళ్యాణ్ లేదా భీమ్లా నాయక్ మీద చేస్తున్న దాడి కాదు ఇది థియేటర్ల మీద చేస్తున్న దాడి అని అన్నారు. ఈ దాడుల కారణంగా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి నష్టం ఉండదు కానీ థియేటర్ వ్యవస్థకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.

  English summary
  Nv Prasad fires on Andhra Pradesh government over bheemla Nayak theatres restrictions
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X