అమెజాన్ ప్రైమ్‌లో ఓ పిట్ట కథ సంచలనం.. ఫాస్టెస్ట్‌గా 100 మిలియన్లు

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన చిత్రం ఓ పిట్టకథ. ప్రముఖ నిర్మాత వి ఆనంద ప్రసాద్‌ సారథ్యంలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరై యువ తారలకు దీవెనలు అందించడం ఓ ప్రత్యేకతగా మారడమే కాకుండా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడానికి కారణమైంది. అలాంటి అంచనాల మధ్య రిలీజైన ఓ పిట్టకథ చిత్రం థియేటర్లలో సగటు ప్రేక్షకుడి చేత ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రంలో నటించిన, సంజయ్ రావు విశ్వాంత్, నిత్యాశెట్టి ఫెర్ఫార్మెన్స్‌కు, తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన చెందుముద్దు ప్రతిభకు సినీ విమర్శకులు సంతృప్తి చెందడం కూడా తెలిసిందే.

మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ పిట్ట కథ చిత్రం థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకొన్నది. అదే క్రమంలో ఓ పిట్టకథ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం రేపుతున్నది. థియేటర్లలోనే కాకుండా ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై సత్తా చాటడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రం అతివేగంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఫ్యామిలీ అంతా కలిసి చిత్రంగా ప్రశంసలు అందుకొంటున్నది. ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించడంపై నిర్మాత వీ ఆనంద ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి, చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 O Pitta Katha create rare record in Amazon Prime

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు..
సాంకేతిక నిపుణులు:
పాటలు: శ్రీజో ,
ఆర్ట్: వివేక్‌ అన్నామలై,
ఎడిటర్‌: డి.వెంకటప్రభు,
కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌.,
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి,
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X