Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మనసు హత్తుకునేలా ఓ పిట్ట కథ టీజర్.. మహేష్‌బాబు ఫిదా.. యూనిట్‌పై ప్రశంసలు
మనసుకు హత్తుకొనే కథ, కథనాలతో యువ హీరో, హీరోయిన్లతో ఓ పిట్ట కథను టీజర్లోనే ఆసక్తికరంగా, ఆకట్టుకొనే విధంగా రూపొందించిన దర్శకుడు చెందు ముద్దును సూపర్‌స్టార్ మహేష్ బాబు అభినందించారు. చిన్న సినిమా అయినా.. భారీ విజయాన్ని అందుకోవాలని మహేష్ ఆకాంక్షించారు. ఇక ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథను సహజసిద్ధంగా.. ఎలాంటి ద్వందర్థాలు, అశ్లీలత లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా రూపొందించిన చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక ఓ పిట్ట కథ టీజర్ ఎలా ఉందంటే..
పచ్చటి వాతావరణంలో అందమైన ప్రేమకథ
పచ్చటి గ్రామీణ వాతావరణంలో ఓ అందమైన అమ్మాయి వెంకటలక్ష్మి అంటే అదే ఊరిలో ఉండే మరో అబ్బాయి ప్రభుకు చెప్పలేనంత ఇష్టం. వెంకటలక్ష్మిని కలువడానికి పట్టణం పిల్లోడు క్రిష్ వచ్చి ఆమె ప్రేమలో పడుతాడు. ఈ ట్రాయంగిల్ స్టోరి జరుగుతుండగానే.. వెంకటలక్ష్మీ అదృష్టం కావడం కథలో ట్విస్ట్.
హృదయానికి హత్తుకొనేలా
ఇక ఓ పిట్ట కథ మూవీ చూడగానే టీజర్ చూడగానే మంచి ఆహ్లదకరంగా.. హృదయానికి హత్తుకునేలా సన్నివేశాలు తెరకెక్కించినట్టు స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఇద్దరు అబ్బాయిలు.. ఓ చలాకీ అమ్మాయి మధ్య అందమైన ప్రేమకథను తెరకెక్కించినట్టు అనిపిస్తున్నది.
అందమైన లోకేషన్లలో క్యూటీ స్టోరి
అందమైన లోకేషన్లలో ఓ పిట్ట కథను సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ తన ప్రతిభతో పెద్ద కథగా మలిచారని.. దానికి ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం సినిమాకు అదనపు హంగులను తీసుకురావడమే కాకుండా ఫీల్‌గుడ్‌గా మారింది. అందర్నీ ఆకట్టుకొంటున్న టీజర్ మీ కోసం..
తెర వెనుక.. తెర ముందు
ఓ పిట్ట కథ చిత్రంలో యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు: శ్రీజో, ఆర్ట్స్: వివేక్ అన్నామలై, ఎడిటర్: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్ కుమార్ యన్., సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చెందు ముద్దు.