ఓ పిట్టకథ.. చిన్న సినిమాకు మహేష్ బాబు సాయం

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో పెద్ద ఎత్తున చిన్న సినిమాలు, విలక్షణ కథాంశాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలకు బడా హీరోలు, దర్శకనిర్మాతల సపోర్ట్ కూడా లభిస్తోంది. వారి ద్వారా టీజర్, ట్రైలర్ లాంచ్ చేయించి ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారు నయా మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ''ఓ పిట్టకథ'' మూవీ కోసం తనవంతు సాయం అందించబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. చెందు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

O Pitta Katha Teaser Update

ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం మహేశ్ బాబు సాయం కోరగా ఆయన వెంటనే ఓకే అనేశారట. ఈ మేరకు మహేష్ చేతుల మీదుగా రేపు (ఫిబ్రవరి 7) సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు మేకర్స్. వినోదభరితమైన సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెందు అంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X