twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఓ పిట్ట కథ' ట్విట్టర్ రివ్యూ: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పిట్ట కథపై ఆడియన్స్ ఫీలింగ్స్..

    |

    నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'ఓ పిట్ట కథ'. చందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజయ్ తో పాటు విశ్వాంత్, నిత్య నటించారు. (మార్చి 6) ఈ రోజు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పలు చోట్ల ప్రీమియర్స్ షోస్ వేశారు. ఆ షోస్ చూసిన ఆడియన్స్ ఈ పిట్ట కథ గురించి ఏమంటున్నారో చూద్దామా..

    భారీ ప్రమోషన్స్.. హైప్

    భారీ ప్రమోషన్స్.. హైప్


    కొడుకు సంజయ్ వెండితెరకు పరిచయం కాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేశారు బ్రహ్మాజీ. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ, సినీ ప్రముఖుల చేత విడుదల చేయిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.

    రొమాంటిక్ థ్రిలర్.. ఇదీ రియాక్షన్

    రొమాంటిక్ థ్రిలర్.. ఇదీ రియాక్షన్


    ఈ నేపథ్యంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఓ పిట్ట కథ' ఆడియన్స్ నుంచి పాజిటివ్ గానే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ రొమాంటిక్ థ్రిలర్ కథాంశం ఆకట్టుకుందంటూ రియాక్ట్ అవుతున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

    హీరో హీరోయిన్స్ రోల్స్..

    హీరో హీరోయిన్స్ రోల్స్..


    లీడ్ రోల్స్ పోషించిన సంజయ్, విశ్వాంత్, హీరోయిన్ నిత్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు ఆడియన్స్. ఈ ముగ్గురి పాత్రలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని, వారి వారి పాత్రల్లో ఇమిడిపోయి న్యాయం చేశారని చెబుతున్నారు.

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పిట్టకథ భలే ఉందిలే!

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పిట్టకథ భలే ఉందిలే!


    సినిమాలో చూపించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ, గత సినిమాలతో పోల్చితే కాస్త కొత్తగా అనిపించిందని టాక్ బయటకొచ్చింది. మూడు విభిన్న సామాజిక స్థితిగతులకు చెందిన ముగ్గురు యంగ్‌స్టర్స్ నడుమ నడిచిన ఈ పిట్టకథ భలే ఉందని అంటున్నారు.

    చిరంజీవి సహా పలువురు పెద్దలు

    చిరంజీవి సహా పలువురు పెద్దలు


    ఇకపోతే ఈ సినిమాకు ముందునుంచే టాలీవుడ్ సినీ ప్రముఖుల సపోర్ట్ లభించడం చాలా ప్లస్ అయింది. చిరంజీవి సహా పలువురు పెద్దలు బ్రహ్మాజీ తనయుడికి మంచి సపోర్ట్ అందించిన సంగతి తెలిసిందే.

    ఎన్టీఆర్ విషెస్

    ఎన్టీఆర్ విషెస్


    ఓ పిట్టకథ రిలీజ్ కాబోతున్న కొన్ని గంటల ముందే ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 'నా స్నేహితుడు బ్రహ్మాజీకి, ఆయన తనయుడు సంజయ్‌కు, రేపు రిలీజ్ కాబోతోన్న ఓ పిట్ట కథ యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్' అని పేర్కొన్నారు.

    Recommended Video

    O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent || Filmibeat Telugu
    ఓ పిట్ట కథ మూవీ

    ఓ పిట్ట కథ మూవీ


    భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై చందు మొద్దు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వీ ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. బ్రహ్మాజీ, బాలరాజు, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Brahmaji son Sanjay 'O Pitta Katha' movie is released today (March 6th). The audians responce on this movie as follows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X