Odela 2 : పూనకాలు తెప్పిస్తోన్న ఓదెల 2 సింగిల్ .. తమన్నా సాంగ్ ఎలా ఉందంటే?
కరోనా టైంలో హిట్ అయిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ఓదెల 2. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మలు కీలకపాత్రలు పోషించారు. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఓదెల 2ను నిర్మించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఓదెల 2 చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. మహాకుంభమేళా సందర్భంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించగా దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సస్పెన్స్, థ్రిల్, హార్రర్ అంశాలను ప్రేక్షకులను కట్టిపడేశాయి. అన్నింటికి మించి అఘోరీగా తమన్నా భాటియా నటన హైలైట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్‌లో అలరించిన మిల్కీ బ్యూటీ ఈ చిత్రంలో ఎలా చేశారోనన్న ఉత్కంఠ నెలకొంది.

విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా నటిస్తున్న సినిమా కావడంతో ఆమె కెరీర్‌కు కూడా ఈ సినిమా ఎంతో ప్రాధాన్యత ఉండటంతో తమన్నా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త అమ్మాయిల రాకతో గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్‌తో బండి నెట్టుకొస్తున్నారు తమన్నా. ఈ క్రమంలో రేసులో నిలబడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఆమె కూడా ఆకాంక్షిస్తున్నారు. తమన్నా ఫైట్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
కేవలం తమన్నా వల్లే ఓదెల 2పై బజ్ నెలకొందని ఇండస్ట్రీ వర్గాలు సైతం అనుకుంటున్నాయి. అయినప్పటికీ నిర్మాతలు ఈ చిన్న సినిమా కోసం ఖర్చుకు వెనుకాడలేదని టాక్. ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం ఓదెల 2కి ఏకంగా రూ.25 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందట. భారీ స్టార్ క్యాస్టింగ్ లేనప్పటికీ.. సెట్స్, వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా టాక్. థియేట్రికల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కలిపి ఓదెల 2కు రూ.28 కోట్ల వరకు బిజినెస్ అయ్యిందట. ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వచ్చినప్పటికీ సినిమా కూడా హిట్ అయి కలెక్షన్స్ రావాలని మేకర్స్ భావిస్తున్నారు.
మరో రెండ్రోజుల్లో సినిమా రిలీజ్ కానుండటంతో ఓదెల 2 యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ఈ సినిమాలోని ఎమూలాడ రాజన్న సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంపత్ నంది సాహిత్యం అందించగా.. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చగా, అనిరుథ్ శాస్త్రి ఆలపించారు. ఊరంతా ఏదో సమస్యలో ఉండటం వారి కోసం తమన్నా ఆ పరమేశ్వరుడి కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఇందులోని ప్రతీ విజువల్ అద్భుతంగా వచ్చింది. పాట వింటున్నంత సేపు పూనకాలు వచ్చినట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ , సాహిత్యం, సంగీతం పర్ఫెక్ట్‌గా సెట్ కావడంతో ఈ పాట దుమ్మురేపుతోంది. మరి థియేటర్‌లో ఈ సాంగ్ ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. అన్నట్లు చివరిలో ఈ సినిమా మేకింగ్ సీన్స్‌ను కూడా చూపించారు.


Click it and Unblock the Notifications











