‘మదర్ థెరిస్సా’ జీవితంపై సినిమా రాబోతోంది, వివరాలు ఇవే..
అత్యంత ప్రతిష్టాత్మమైన నోబెల్ పురస్కారం అందుకుని భారతదేశానికే కీర్తి తెచ్చిన ప్రముఖుల్లో మదర్ థెరిసా ఒకరు. మానవాళిని దారిద్య్రం, బాధల నుంచి విముక్తి కల్పించటానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ బహుమతి దక్కింది. సేవాగుణంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మదర్ థెరిస్సా జీవితంపై త్వరలో బాలీవుడ్ మూవీ రాబోతోంది.
ఈ చిత్రానికి సీమా ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరీష్ జోహార్, ప్రాచీ మన్మోహన్ నిర్మించబోయే ఈ బయోపిక్‌లో బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్స్ నటించబోతున్నారు.

ఓ ఆంగ్ల పత్రికతో డైరెక్టర్ సీమా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ప్రజలను సేవా మార్గంలో నడిపించడంలో మదర్ థెరిస్సా ఎంత కృషి చేశారు. ఆమె ఈ ప్రపంచంలో ఎంతో మందికి స్పూర్తి. ఒక మామూలు మహిళ అంత పెద్ద సేవా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే విషయాలను వెల్లడిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.
ఈ బయోపిక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నాం. మదర్ థెరిసా జన్మించిన ఆల్బేనియా దేశంలోని 'స్కోయె' పట్టణంతో పాటు పారిస్, ఐర్లాండ్, కోల్ కతా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ మొదలు కానుంది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











