Official: పవన్ కళ్యాణ్‌పై పోరాటం చేయబోతున్న రానా.. యుద్ధం మొదలైంది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా అనుకున్నదే జరిగింది. రానా దగ్గుబాటి బాహుబలి తరువాత మరో అగ్ర హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా రీమేక్ లో ఈ ఇద్దరు కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అఫీషియల్ గా వివరణ ఇచ్చారు.

రానా రాకతో.. పెరిగిన అంచనాలు
గత కొంతకాలంగా వరుసగా సినిమాల అప్డేట్స్ తో అభిమానులకు మంచి కిక్కుస్తున్న పవర్ స్టార్ నేడు మరో మంచి అప్డేట్ తో కిక్కు డోస్ పెంచేశాడు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 12లో రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు.

రూమర్స్ అన్ని అబద్ధాలే..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూమర్స్ చాలానే వచ్చినప్పటికీ రానా మళ్ళీ వెనుకడుగు వేసినట్లు టాక్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఇంకా ఫైనల్ కాలేదని చర్చాలు జరుగుతున్నట్లు కూడా రానా తెలియజేశాడు. ఇక అనుమానాలు ఎక్కువవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.

రెగ్యులర్ షూట్ మొదలు..
ఇక ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంచ్ వేడుకను నిర్వహించిన చిత్ర యూనిట్ నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనుంది. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు సాగర్ చంద్ర ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమాకు థమన్ సంగీతం అంధించనున్నాడు.
Recommended Video


టార్గెట్ సెట్ చేసుకున్న పవన్..
ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ కేవలం 40రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్లుగా టాక్ వస్తోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత పవర్ స్టార్ క్రిష్ పిరియాడిక్ డ్రామాను పూర్తి చేయనున్నాడు. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయవచ్చని టాక్.


Click it and Unblock the Notifications











