OG2: ఓజీ2 మూవీపై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ సినిమాపై అఫీషియల్ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ'(OG)సినిమా బాక్సాఫీస్ ఎలాంటి విషయాన్ని అందుకుందో ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, సుజీత్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌ గ్యాంగ్‌స్టార్ స్టోరీని డైరెక్టర్ సుజిత్ ప్రజెంట్ చేసిన విధానం, మ్యూజిక్ తమన్ అందించిన బీజీఎం ఈ సినిమాను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్‌తో అప్పట్లోనే పార్ట్-2 పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా ఓజీ2 మూవీపై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చింది.

దే కాల్ హిమ్ ఓజీ'(OG) సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ జోడీగా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ విలనిజంతో మెప్పించారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి స్టార్ కాస్టింగ్ మరింత బలాన్ని అందించాయి. ఇక క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్‌తో అప్పట్లోనే పార్ట్-2 పై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో 'ఓజీ 2'పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 'ఓజీ 2'కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

OG 2 Official Update Pawan Kalyan Team Confirms Discussions After Sujeeth s Return

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు సుజీత్ ఇప్పటికే సీక్వెల్ కథపై వర్క్ చేస్తున్నట్లు, కథ, స్క్రీన్‌ప్లే పనులు కీలక దశకు చేరుకున్నాయని, సరైన సమయంలో పవన్ కళ్యాణ్‌కు కథను వినిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్త సినిమా ప్రాజెక్టులపై వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

ఇలా ఓజీ 2 పై వస్తున్న ఊహాగానాల మధ్య పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PK Creative Works) పవన్ కల్యాణ్ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేసింది. తాజాగా ఓ పోస్ట్ తో పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. "ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చిస్తాం" అంటూ పవన్ కళ్యాణ్ టీం సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఈ ఒక్క పోస్ట్‌తో 'ఓజీ 2' ప్రాజెక్ట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, ఆయన తిరిగి వచ్చిన తర్వాత సీక్వెల్‌కు సంబంధించిన కీలక చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభ తేదీ లేదా అధికారిక ప్రకటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, 'ఇచ్చిన మాట తప్పం'అనే కామెంట్స్ 'ఓజీ 2'తప్పకుండా వస్తుందనే నమ్మకం మరింత బలపడింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్ ఇప్పటికే OG యూనివర్స్‌ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ మాత్రమే కాకుండా ప్రీక్వెల్ అవకాశాలపై కూడా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఓజాస్ గంభీర గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అతని గతంలో జరిగిన కీలక సంఘటనలు ఏమిటి? ముంబై అండర్‌వరల్డ్‌పై అతను ఎలా ఆధిపత్యం సాధించాడు? వంటి అంశాలను ప్రీక్వెల్‌లో చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more about: pawan kalyan sujeeth og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X