OG నటుడిని సెట్‌లోనే కొట్టిన ఏఎన్ఆర్... ఆ దర్శకుడి జోక్యంతో నాగార్జున డేరింగ్ డెసిషన్

సినీరంగంలో స్థిరపడాలంటే గుమ్మడికాయ అంత టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటారు. ఆరడుగుల హైట్, సిక్స్ ప్యాక్ బాడీ, అందం ఉండగానే సరిపోదని ఎందరో హీరోలు తమ ఫెయిల్యూర్ స్టోరీలతో నిరూపించారు. వీరే కాదు.. ఇండస్ట్రీలో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉండి, తాతలు, తండ్రులు స్టార్స్‌గా వెలుగొందుతున్నా హీరోలుగా నిలదొక్కుకోలేకపోయిన వారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ఉన్నారు. ఈ కోవలకే వస్తారు హీరో వెంకట్.

హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన వెంకట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీ బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకట్.. పార్థు అనే పాత్ర పోషించగా ఈ రోల్‌కి మంచి గుర్తింపు వచ్చింది. చాలా రోజుల తర్వాత వెంకట్ తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. 1998లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్.. ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయారు. చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ బండి నెట్టుకొస్తున్నారు. ఈ దశలో ఓజీలో ఛాన్స్ దొరకడం, ఈ పాత్రకు బాగా గుర్తింపు రావడంతో వెంకట్ మంచి జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

OG Actor Venkat says Akkineni Nageswara Rao slapped me during Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi shooting

నాగార్జున దృష్టిలో పడ్డ వెంకట్
విజయవాడకు చెందిన వెంకట్ మనోహార్ కుటుంబం తండ్రి వ్యాపార రీత్యా ముంబైలో స్థిరపడింది. వీరి కుటుంబానికి సొంతంగా బట్టల వ్యాపారం ఉండేది. ఈ క్రమంలో వీరి బ్రాండెడ్ షర్ట్స్‌ను వేసుకుని తిరిగేవాడు, ఆయనే వీటికి బ్రాండింగ్ చేసేవారు. అలా ఓ మేగజైన్‌లో వెంకట్ ఫోటోలు.. కింగ్ అక్కినేని నాగార్జున దృష్టికి చేరాయి. తొలి నుంచి యంగ్ టాలెంట్‌ను ప్రొత్సహించడంలో నాగార్జున ముందుండేవారు. అలా వెంకట్‌ను తను నిర్మించబోయే శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాలో హీరోగా తీసుకున్నారు.

తొలి చిత్రమే సూపర్‌హిట్
అక్కినేని నాగార్జున నిర్మాతగా, వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, జంధ్యాల మాటల రచయితగా పనిచేసిన సినిమాలో వెంకట్ నటించడం నిజంగా ఆయన అదృష్టమే అని చెప్పాలి. చాందినీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, మురళీ మోహన్, చలపతి రావు, బెనర్జీ, శివాజీ, రమాప్రభ, ప్రియ తదితరులు నటించారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమాలు పాటలు అప్పట్లో ఒక ఊపు ఉపాయి. అన్ని వర్గాల వారికి సినిమా నచ్చడంతో శ్రీ సీతారాముల కళ్యాణం చిత్రం విజయం సాధించింది.

ఏఎన్ఆర్‌తో జ్ఞాపకాలు
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వెంకట్‌ను అక్కినేని నాగేశ్వరరావు చెంప దెబ్బ కొట్టారట. ఈ విషయాన్ని వెంకట్ ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ రోజున రామచంద్రాపురం కోటలో షూటింగ్ చేస్తుండగా సీన్‌‌కి సరిగా రియాక్ట్ కాకపోవడంతో ఏఎన్ఆర్ లాగిపెట్టి పీకారని వెంకట్ తెలిపారు. ఆ తర్వాత షాట్‌ సరిగ్గా వచ్చిందని ఆయన ఆ మహానుభావుడితో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అది తనకు తొలి సినిమా అని.. ఆ టైంలో కెమెరా అంటే ఏంటీ? యాక్టింగ్‌లో కనీసం ఏ, బీ, సీ, డీలు కూడా తెలియవన్నారు. కానీ వైవీఎస్ చౌదరి గారు చాలా ఓపిగ్గా నన్ను భరించారు.. బాంబేలో పెరగడంతో, ఇక్కడ తెలుగు సినిమాల గురించి ఏం ఐడియా లేదు, ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేదు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే.. నాకు చిన్న స్క్రీన్ టెస్ట్ చేసి చౌదరిగారు నాగార్జున గారికి చూపించడంతో ఆయన వెంటనే ఓకే చేశారని వెంకట్ తెలిపారు.

More from Filmibeat

Read more about: og venkat akkineni nageswara rao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X