పవన్ కళ్యాణ్ ‘ఓజీ’పై కన్నడ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మా సినిమాను కాపీ కొట్టారంటూ..

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'OG (They Call Him OG)'బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మారింది. టాలీవుడ్‌లో ఏడాదికి టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే, తాజాగా ఓజీ సినిమాపై ఆసక్తికరమైన వివాదం మొదలైంది. తన సినిమాను కాపీ కొట్టి, ఓజీ సినిమా తీశారంటూ ఓ కన్నడ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ దర్శకుడు ఎవరు? ఇంతకీ ఆ వివాదమేంటీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (They Call Him OG). ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సెప్టెంబర్ 25, 2025న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సునామీలా దూసుకుపోయింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజే రూ. 155 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇండియాలో రూ. 190 కోట్లు నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి టాలీవుడ్‌లో ఏడాదికి టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది

OG Copy Controversy Kannada Director R Chandru Claims Pawan Kalyan s Film Took Inspiration from Kabzaa

ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ 'ఓజీ'సినిమాపై ఓ ఆసక్తికరమైన వివాదం రేగింది. ఆ వివాదానికి కారణం కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు (R Chandru) చేసిన వ్యాఖ్యలు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "OG సినిమా నా 'కబ్జా' మూవీని ఆధారంగా తీసుకుని తీశారు"అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్. చంద్రు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్రతో కబ్జా అనే సినిమాను తీశాను. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ట్రీట్‌మెంట్ ఓజీలో కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా మా కబ్జా నుంచి స్పూర్తి పొందినట్టుంది. కొన్ని షాట్లు దాదాపు ఒకేలా ఉన్నాయి"అని చెప్పడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆయన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సరదా వ్యాఖ్యగా చేసినా, పవన్ అభిమానులు మాత్రం దీన్ని తేలికగా తీసుకోలేదు.

'కబ్జా' చిత్రం నేపథ్యం
2023లో విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చి నిరాశ పరచింది. ఉపేంద్ర, శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, శ్రీయా శరణ్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ పరంగా మాత్రం ఆకట్టుకున్నా కథాపరంగా ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 'కేజీఎఫ్' (KGF) చిత్రానికి పోలికలు ఉండటం వల్ల కబ్జా సినిమాను "కేజీఎఫ్ క్లోన్"అంటూ అప్పట్లో నెటిజన్లు ట్రోల్ చేశారు.

పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఆర్. చంద్రు, "కబ్జా"(Kabzaa)సినిమాతో పరిచయమైన ఈ దర్శకుడు ఓజీ చిత్రంపై తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు. కన్నడ డైరెక్టర్ చంద్రు వ్యాఖ్యలపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. "కబ్జా సినిమాకు కథే లేదని ప్రేక్షకులు తిరస్కరించారు. కేజీఎఫ్ కాపీ అన్న ట్యాగ్‌తో ఆ సినిమా బాగా ట్రోల్ అయ్యింది. అలాంటి సినిమాను ఓజీతో పోల్చడం అంటే అవమానమే" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "కబ్జా సినిమాకు కాపీ ట్యాగ్ తగిలి ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఓజీని కాపీ అంటున్నాడంటే అదే జోక్!" అని సెటైర్లు వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og movie r chandru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X