Sujeeth - Sachin: ఒకే ఫ్రేమ్‌లో సుజీత్- సచిన్ .. ఓజీ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ ఏంటీ?

Sujeeth- Sachin Tendulkar: 'ఓజీ' బ్లాక్‌బస్టర్‌తో టాలీవుడ్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సుజీత్. ఈ మూవీ కేవలం డైరెక్టర్ కెరీర్ లోనే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా మారిపోయింది. అలాగే.. బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను క్రియేట్ చేసి.. పవర్ స్టార్ కెరీర్ లో ఆల్ టైం హిట్ గా నిలిచింది ఓజీ. అలాంటి బాస్ట్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సుజీత్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. అలాగే.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, సుజీత్ లు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. ప్రస్తుతం సినీ, వ్యాపార, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

డైరెక్టర్ సుజీత్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు. అయితే ఈసారి సినిమా కాదు.. ఒక వ్యాపార ప్రకటన (Advertisement) కోసం కెమెరా పట్టారు. అదీ సాధారణ యాడ్ కాదు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో కలిసి తీసిన టెక్నో పెయింట్స్ యాడ్. టెక్నో పెయింట్స్ సంస్థ ప్రస్తుతం తమ వ్యాపార విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో బ్రాండింగ్‌ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది.

OG Director Sujeeth Joins Hands with Cricket Legend Sachin Tendulkar for Techno Paints Ad

ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుజీత్ .. టెక్నో పెయింట్స్ ప్రమోషన్స్ లో భాగంగా సచిన్ టెండూల్కర్ తో కలిసి రెండు క్రియేటివ్ యాడ్ ఫిల్మ్స్‌ ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రత్యేక యాడ్ ఫిల్మ్స్‌కు సుజీత్ దర్శకత్వం వహించగా, వాటి చిత్రీకరణ ముంబైలో పూర్తయింది. ఈ యాడ్స్ ను త్వరలోనే టెలివిజన్, డిజిటల్ మీడియా, ప్రింట్, అవుట్‌డోర్ వంటి అన్ని వేదికల్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

మొత్తం గా చూసుకుంటే, సుజీత్ ఇప్పుడు సినిమాలకే కాకుండా బ్రాండ్ యాడ్‌లలో కూడా తన క్రియేవిటీని బయటపెడుతున్నారు. సచిన్ టెండూల్కర్‌తో ఆయన చేసిన టెక్నో పెయింట్స్ యాడ్ భారతీయ మార్కెటింగ్ రంగంలో ఒక పెద్ద ఇంపాక్ట్‌ను సృష్టించబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుజీత్ తన సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. సచిన్‌తో పనిచేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు, సినీప్రేమికులు ఈ కలయికను "లెజెండ్ డైరెక్టర్ మీట్స్ క్రికెట్ గాడ్" అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదెలా ఉంటే.. మరోవైపు, సుజీత్ తన తదుపరి సినిమా 'బ్లడీ రొమియో' (Bloody Romeo)పై దృష్టి సారిస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నాని ఈ సినిమాలో పాల్గొనబోతున్నారు. బ్లడీ రొమియో తరువాత సుజీత్ 'ఓజీ సీక్వెల్' పనులను ప్రారంభించనున్నారని సమాచారం.

More from Filmibeat

Read more about: sujeeth og movie sachin tendulkar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X