OG: పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్.. ఆ సినిమాతో పాటు ఓజీ గ్లింప్స్ కూడా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో కొందరిని మాత్రం వాళ్ల అభిమానులు దేవుళ్లుగా కొలుస్తుంటారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. అంతలా ఈ బడా హీరో తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఊపులోనే వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తున్నాడు.
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తున్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. సాహో ఫేం సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రంపై హైప్ భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే తీస్తున్నారు.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన షూటింగ్ మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ వస్తోంది. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యాభై శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఫ్యాన్స్ కోరుకునే పోస్టర్లు కానీ, టీజర్ కానీ విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా గ్లింప్స్‌ను పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది.
'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) గ్లింప్స్ వీడియోకు సంబంధించిన తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన రీ రిలీజ్ అవుతున్న 'గుడుంబా శంకర్' మూవీకి ఈ గ్లింప్స్‌ను యాడ్ చేయబోతున్నారట. అంటే.. పవన్ కల్యాణ్ పుట్టినరోజున అభిమానులకు పాత, కొత్త సినిమాల పరంగా డబుల్ సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని చెప్పాలి.
హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











