OG: పవన్ ఫ్యాన్స్ ఊపిరి తీసుకోండి.. ఓజీ ఫస్ట్ లుక్, టీజర్ వచ్చేస్తున్నాయి!

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని.. వరుస చిత్రాలతో తెగ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. ఏమాత్రం బ్రేకులు లేకుండా ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. చిన్న వయసులోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ భారీగా ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.

OG Movie Pawan Kalyan First Look Poster and Teaser Dates Locked

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ యాభై శాతం వరకూ పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఫ్యాన్స్ కోరుకునే పోస్టర్లు కానీ, టీజర్ కానీ విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఓజీలోని పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, టీజర్‌ డేట్ల గురించి తాజాగా ఓ న్యూస్ లీకైంది.

తాజా సమాచారం ప్రకారం.. 'OG' సినిమాలో పవన్ కల్యాణ్ లుక్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందట. దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఇందులో పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్‌తో దర్శనం ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో 'OG' మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసే డేట్‌ను కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతుందట. అంటే.. 20 రోజుల గ్యాప్‌లో ఫ్యాన్స్‌కు రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయన్న మాట.

OG Movie Pawan Kalyan First Look Poster and Teaser Dates Locked

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X