పవన్ నుంచి ఇండిపెండెన్స్ డే సర్‌ప్రైజ్.. ఇది కదా అసలైన పండుగ అంటే!
ఏ ఇండస్ట్రీలోని స్టార్ హీరో అయినా ఏడాది ఒక్క సినిమాను చేయడం చాలా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒకరిద్దరు తెలుగు బడా హీరోలు ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. గతంలో స్లోగానే సినిమాలు చేసినా.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో ఒక్కో మూవీని కంప్లీట్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలను ప్రేక్షకులకు అదించాడు. ఇప్పుడు కూడా మూడు నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి.
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమానే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ భారీగా ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముంబై నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అక్కడే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అలా ఇప్పటికే మూడు షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ నుంచి ఎన్నో అప్‌డేట్లు వస్తున్నా.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప్రచార చిత్రాలు మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లుక్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందట. దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇందులో పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్‌తో దర్శనం ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











