OG: పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ సర్‌ప్రైజ్.. ఇది మాత్రం ఊహించరు భయ్యా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్టార్‌కూ సాధ్యం కాని విధంగా వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన అతడు.. ఇప్పుడు కూడా చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. 'సాహో'తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

Recommended Video

OG వస్తున్నాడు Jan 1st సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన Pawan Kalyan | Telugu Filmibeat

OG Movie Pawan Kalyan Special Poster Release On January 1st

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వచ్చింది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

తాజా సమాచారం ప్రకారం.. 'OG' సినిమాలో పవన్ కల్యాణ్ లుక్‌కు సంబంధించిన మరో పవర్‌ఫుల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందట. దీన్ని నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ లుక్ అందరినీ ఫిదా చేసేలా ఉంటుందని సమాచారం.

OG Movie Pawan Kalyan Special Poster Release On January 1st

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రాబోతున్న 'OG' మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తుందట. దీంతో ఈ సర్‌ప్రైజ్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X